Home   »  చదువు   »   గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. ఎడిట్ ఆప్షన్ అందించిన TSPSC..!

గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. ఎడిట్ ఆప్షన్ అందించిన TSPSC..!

schedule raju
TSPSC has provided edit option to Group-1 candidate

తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసిన 563 గ్రూప్-1 సర్వీసెస్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ (Edit option to Group-1 candidate) అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తుల్లో పొందుపరిచిన వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు ఈ అవకాశం ఉంటుంది అని TSPSC తెలిపింది. కాగా గ్రూప్-1కు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి జరగనున్నాయి.

Edit option to Group-1 candidate: ఎడిట్ చేయడం ఎలా..?

  • tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో, TSPSC గ్రూప్-1 సర్వీసెస్ 2024 కోసం ఆన్​లైన్ ఎడిట్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • అవసరమైన వివరాలను నమోదు చేసి, Get OTP పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ నెంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
  • దరఖాస్తు ఫారమ్‌ను తనిఖీ చేసి, అవసరమైన మార్పులు చేయండి.
  • Enterపై క్లిక్ చేసి, పేజీని డౌన్‌లోడ్ చేయండి.

Also Read: APPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆన్సర్ ‘కీ’ విడుదల..