Home   »  చదువు   »   నేటి నుంచి UPSC సివిల్స్ దరఖాస్తుల స్వీకరణ..

నేటి నుంచి UPSC సివిల్స్ దరఖాస్తుల స్వీకరణ..

schedule mahesh

UPSC applications | దేశ ప్రగతిలో బ్యూరోక్రాట్‌లుగా పనిచేయాలనే లక్ష్యంతో IAS, IPS మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సిద్ధమవుతున్న UPSC సివిల్స్ అభ్యర్థులకు కీలక అప్‌డేట్ రావడం జరిగింది. UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్-2024 కోసం దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి (ఫిబ్రవరి 14, 2024) ప్రారంభమైంది.

upsc-applications-will-be-accepted-startingtoday

UPSC applications | UPSC (Union Public Service Commission) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష-2024 కోసం దరఖాస్తుల నమోదు ప్రక్రియ (ఫిబ్రవరి 14, 2024) నేటి నుంచి మొదలయింది. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 5, 2024 వరకు వుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు upsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనరల్ అభ్యర్థులు UPSC సివిల్ ప్రిలిమ్స్ పరీక్షను గరిష్టంగా ఆరుసార్లు రాయవచ్చు. కానీ SC/ST/OBC మరియు PwD అభ్యర్థులకు సడలింపు వుంటుంది. SC మరియు ST అభ్యర్థులు అపరిమిత సంఖ్యలో రాయవచ్చు. OBC, వికలాంగ అభ్యర్థులు 9 సార్లు రాయవచ్చు. ప్రిలిమినరీ పరీక్షలో ఏదైనా పేపర్ రాస్తే అభ్యర్థిని ఒక ప్రయత్నంగా లెక్కిస్తారు.

అభ్యర్థులు 2, ఆగస్టు 1991కి ముందు జన్మించి వుండకూడదు

వయసు విషయానికి వస్తే కనీసం 21 సంవత్సరాలు వుండాలి. ఆగస్టు 1, 2023 నాటికి 32 సంవత్సరాలు నిండిన వారు అర్హులు కాదు. అంటే ఆగస్టు 1, 2023 నాటికి 32 ఏళ్లు మించకూడదని UPSC నిబంధనలు చెపుతున్నాయి. మొత్తంగా చూస్తే అభ్యర్థులు 2, ఆగస్టు 1991కి ముందు జన్మించి వుండకూడదు. అయితే SC, ST అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు వుంటుంది. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, కేటగిరీలను బట్టి మరికొందరికి సడలింపులుంటాయి. ఇక IAS, IPS, IFS సర్వీసు కోసం ప్రయత్నించే అభ్యర్థులు ఖచ్చితంగా భారతీయ పౌరులై వుండాలి.

Also Read | APPSC గ్రూప్‌-2 హాల్‌టికెట్లు విడుదల..