Home   »  నేరాలు   »   డీప్‌ఫేక్ టెక్నాలజీతో 200 కోట్లు కొట్టేసిన స్కామర్‌లు.!

డీప్‌ఫేక్ టెక్నాలజీతో 200 కోట్లు కొట్టేసిన స్కామర్‌లు.!

schedule raju

Deepfake Technology | డీప్‌ ఫేక్‌ వాడి హాంకాంగ్‌లో ఓ MNC సంస్థ నుంచి సైబర్ కేటుగాళ్లు రూ. 200 కోట్లు కొట్టేశారు. లండన్‌లో ఉన్న CFOకు డబ్బులు వేయాలని సూచిస్తూ సంస్థ ఆర్థిక విభాగంలోని ఓ ఉద్యోగికి మెయిల్‌ పంపగా ఈ ఉదంతం జరిగింది.

200 crores scamed by using deepfake technology

Deepfake Technology | డీప్‌ ఫేక్‌ వాడి హాంకాంగ్‌లో ఓ MNC సంస్థ నుంచి కేటుగాళ్లు రూ. 200 కోట్లు కొట్టేశారు. లండన్‌లో ఉన్న CFOకు డబ్బులు వేయాలని సూచిస్తూ సంస్థ ఆర్థిక విభాగంలోని ఓ ఉద్యోగికి మెయిల్‌ పంపారు. కాన్ఫరెన్స్‌ కాల్‌లోనూ డీప్‌ఫేక్‌ ఉపయోగించి దుండగులు బోర్డు సభ్యుల్లా వ్యవహరించారు. దీంతో వారిని నమ్మిన ఉద్యోగి సుమారు రూ.200 కోట్లు పంపించారు. అది స్కామ్‌ అని అర్థమయ్యాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

ఆర్థిక సంస్థలపై స్కామర్ల కన్ను

పోలీసుల వివరాల ప్రకారం.. “ఆర్థిక సంస్థలను మోసగించడానికి స్కామర్‌లు డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించుకున్న మొదటి కేసును ఈ సంఘటన సూచిస్తుంది. డీప్‌ఫేక్ టెక్నాలజీ ప్రామాణికమైన వ్యక్తుల వలె కనిపిస్తాయి.ఈ టెక్నాలజీతో స్కామర్లు మొత్తం 15 నగదు బదిలీల ద్వారా ఐదు హాంకాంగ్ బ్యాంక్ ఖాతాలకు HK$200 మిలియన్లు ($25.6 మిలియన్లు) కుచ్చు టోపీ పెట్టారు” అని తెలిపారు.

Also Read: హైదరాబాద్‌లో నలుగురు గుజరాత్ సైబర్ మోసగాళ్ల అరెస్ట్