Home   »  నేరాలు   »   బుందేల్‌ఖండ్ గౌరవ్ మహోత్సవ్‌లో పేలుడు.. నలుగురు విద్యార్థులు మృతి..!

బుందేల్‌ఖండ్ గౌరవ్ మహోత్సవ్‌లో పేలుడు.. నలుగురు విద్యార్థులు మృతి..!

schedule raju

Bundelkhand Gaurav Mahotsav | UPలోని చిత్రకూట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బుందేల్‌ఖండ్ గౌరవ్ మహోత్సవ్‌లో బాణాసంచా ఉంచిన ప్రాంతంలో హఠాత్తుగా పేలుడు సంభవించడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. చిత్రకూట్ ఇంటర్ కాలేజీ కార్వీ మైదానంలో బుందేల్‌ఖండ్ గౌరవ్ మహోత్సవ్ నిర్వహించారు.

Four dead in blast at Bundelkhand Gaurav Mahotsav

Bundelkhand Gaurav Mahotsav | ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో నిర్వహిస్తున్న బుందేల్‌ఖండ్ గౌరవ్ మహోత్సవ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ఉంచిన ప్రాంతంలో హఠాత్తుగా పేలుడు సంభవించడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. అయితే, ఈ పేలుడు చాలా తీవ్రంగా సంభవించింది. బాణాసంచా ఉంచిన చోట ఐదు అడుగుల లోతైన గుంత ఏర్పడింది. పేలుడు ధాటికి ఓ యువకుడి మృతదేహం ఇంటి రెండో అంతస్తు పైకప్పుపై పడింది. మిగిలిన వారి శరీర ఆనవాళ్లు దొరకలేదు అని సంబంధిత అధికారులు తెలిపారు.

ఇంటర్ కాలేజీ కార్వీ మైదానంలో Bundelkhand Gaurav Mahotsav

చిత్రకూట్ ఇంటర్ కాలేజీ కార్వీ మైదానంలో బుందేల్‌ఖండ్ గౌరవ్ మహోత్సవ్ నిర్వహించారు. రెండో రోజైన బుధవారం సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బాణాసంచా కార్యక్రమం కోసం వేదిక వెనుక బాంబులు ఉంచారు. అయితే, ఇందులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అటుగా వెళ్తున్న నలుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా సాయంత్రం అధికారులు గుర్తించారు.

మృతులను కార్వీలోని మిషన్ స్క్వేర్‌లో నివాసం ఉంటున్న ధర్మేంద్ర కుమారుడు ప్రభాత్, కార్వీ మాఫీలోని విద్యానగర్‌లో నివసిస్తున్న విశ్వప్రతాప్ కుమారుడు యశ్, కాన్ష్‌రాజ్ కుమారుడు పరాస్, ముఖేష్ కుమారుడు మోహిత్‌గా గుర్తించారు. ఈ నలుగురు విద్యార్థులు కార్యక్రమ సందర్శనకు వెళ్లారు.

మృతుల కుటుంబానికి కోటి రూపాయలు

మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలని SP జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ (X) లో పోస్ట్ చేశారు. బుందేల్‌ఖండ్ మహోత్సవ్‌లో జరిగిన పేలుడు చాలా బాధాకరమని అన్నారు. మృతులందరికీ నివాళులు అర్పించారు. భాజపా ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలి అని అఖిలేష్ యాదవ్ కోరాడు.

బండలో జరగాల్సిన Bundelkhand Gaurav Mahotsav వాయిదా

బుందేల్‌ఖండ్‌లోని అన్ని జిల్లాల్లో పర్యాటక శాఖ బుందేల్‌ఖండ్ గౌరవ్ మహోత్సవ్‌ను జరుపుకుంది. ఈ కార్యక్రమంలో చివరి రోజైన బుధవారం చిత్రకూట్‌లో బాణసంచా కాల్చాల్సి ఉంది. కార్యక్రమానికి ముందు పేలుడు సంభవించడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన తర్వాత చిత్రకూట్‌లో జరగాల్సిన కార్యక్రమాలు రద్దు కాగా ఇప్పుడు ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు బండలో జరగాల్సిన బుందేల్‌ఖండ్ గౌరవ్ మహోత్సవ్ వాయిదా పడింది.

Also Read: హైదరాబాద్‌లో డబ్బు కోసం వ్యక్తిని హత్య చేసిన ముగ్గురు అరెస్ట్…