Home   »  నేరాలు   »   డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడు

డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడు

schedule ranjith

లక్నో | మద్యం కొనుగోలు చేయడానికి డబ్బులు ఇవ్వలేదని 35 ఏళ్ల వ్యక్తి తన 70 ఏళ్ల తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం లక్నోలోని ఇందిరా నగర్‌లో చోటుచేసుకుంది.

son who killed his father | A son who killed his father for money

son who killed his father | బాధితుడు ఖుషీ రామ్ సైనీ, హత్యకు పాల్పడిన నిందితుడైన హేమంత్ సైనీతో కలిసి లక్నోలోని ఇందిరా నగర్‌లో వారి ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసిస్తుండగా, హేమంత్ సైనీ పెద్ద కుమారుడు రింకూ మొదటి అంతస్తులో నివసిస్తున్నాడు. హేమంత్ తన తండ్రి ఖుషీ రామ్ సైనీని డబ్బు అడగగా, హేమంత్ తండ్రి నిరాకరించడంతో అది ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవకు దారితీసింది. ఆ గొడవ విని రింకూ కిందకి దిగాడు. కానీ చిన్న గొడవగా భావించి పైకి తిరిగి వెళ్ళిపోయాడు. కొన్ని గంటల తర్వాత, రింకూ తన తాత నేలపై పడి ఉండటం చూశాడు. ఖుషీ రామ్ గాయాల గురించి రింకూ తన తండ్రిని ప్రశ్నించాడు, కానీ హేమంత్ పట్టించుకోకుండా అక్కడినుండి వెళ్ళిపోయాడు. గదిలో రక్తంతో తడిసిన సుత్తిని రింకూ గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

son who killed his father

పోలీస్ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని హేమంత్‌ను అరెస్టు చేశారు. పోలీసులు హేమంత్‌ను విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు హేమంత్‌ పెయింటర్‌గా పనిచేసేవాడు కానీ చాలా నెలలుగా నిరుద్యోగిగా ఉన్నాడు. హేమంత్ కు సంపాదన లేకపోవడంతో పాటు మద్యానికి, ఇతర ఖర్చుల కోసం డబ్బును అడుక్కుంటున్నందుకు తన తండ్రి తనను వెక్కిరించేవాడని చెప్పాడు. తండ్రి వెక్కిరింపులతో సహనం కోల్పోయిన హేమంత్ అతనిపై సుత్తితో దాడి చేసి హత్య చేసినట్లు DCP అభిజిత్ శంకర్ విచారణలో తేలింది.

Also Read | అజ్మీర్ లో నడి వీధిలో దొంగలకు, పోలీసులకు మధ్య ఫైట్