Home   »  నేరాలు   »   Attack on minor boy | అంబేద్కర్ పూజలో పాల్గొననందుకు మైనర్ బాలుడిపై దాడి

Attack on minor boy | అంబేద్కర్ పూజలో పాల్గొననందుకు మైనర్ బాలుడిపై దాడి

schedule ranjith

కర్ణాటక | కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్‌లో శనివారం BR అంబేద్కర్ ఫోటో పూజలో పాల్గొనలేదని ఆరోపిస్తూ ఓ మైనర్ బాలుడిని కొంత మంది విద్యార్థులు అర్థ నగ్నంగా ఊరేగించిన ఘటన సంచలనం రేపింది.

Attack on minor boy Minor boy attacked for not participating in Ambedkar Puja

బాధితుడి తండ్రి కలబురగి నగరంలోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నిందితులైన విద్యార్థులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు ప్రీ యూనివర్సిటీ కాలేజీలో చదువుతూ ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటునాడు. హాస్టల్‌లోని విద్యార్థులు ప్రతి ఆదివారం డాక్టర్‌ BR అంబేద్కర్‌ ఫొటోకు పూజలు చేస్తారు. బాధితుడు గత ఆదివారం పూజా కార్యక్రమానికి వేరే పని ఉండడంతో హాజరు కాలేదు.

ఘటనకు సంబంధించిన వీడియోను స్వాధీనం చేసుకున్న పోలీసులు(Attack on minor boy)

Attack on minor boy | తనకు మరొక పని ఉండడంతో రాలేదనే విషయాన్ని పూజ నిర్వహించిన విద్యార్థుల బృందానికి కూడా చెప్పాడు. అయినా కూడా ఈ బృందం బాధితుడిపై దాడి చేసింది మరియు ఇతర హాస్టళ్ల నుండి కొంతమంది విద్యార్థులు కూడా వారితో చేరారు. తన కుమారుడిని అర్థ నగ్నంగా అంబేద్కర్‌ ఫోటోతో ఊరేగింపు చేశారని, ఉరేగించే సమయంలో అటుగా వచ్చిన పోలీసు వాహనాన్ని చూసి వారు పరారయ్యారని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు స్వాధీనపరచుకొని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Sultanabad | 27 తులాల బంగారం చోరీ