Home   »  నేరాలు   »   KU Ragging: కాకతీయ యూనివర్శిటీలో కలకలం… ర్యాంగింగ్ కి పాల్పడిన అమ్మాయిలు

KU Ragging: కాకతీయ యూనివర్శిటీలో కలకలం… ర్యాంగింగ్ కి పాల్పడిన అమ్మాయిలు

schedule raju

KU Ragging: యూనివర్శిటీలు, కాలేజీల్లో ర్యాంగింగ్ నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరు విద్యార్థులు మాత్రం మారడం లేదు. కాకతీయ యూనివర్శిటీలో ర్యాగింగ్ చేసిన 81 మంది సీనియర్ విద్యార్థులపై హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపల్ చర్యలు తీసుకున్నారు. 81 మందిని వారంరోజుల పాటు హాస్టల్ నుంచి బహిష్కరించారు.

Kakatiya University Girls guilty of Ragging

KU Ragging: యూనివర్శిటీలు, కాలేజీల్లో ర్యాంగింగ్ నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరు విద్యార్థులు మాత్రం మారడం లేదు. కాలేజీలలో కొత్తగా చేరిన జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధించడం అలవాటుగా మారిపోయింది. విద్యా సంస్థలు ర్యాంగింగ్ కు దూరంగా ఉండాలని సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ సీనియర్ విద్యార్థులు మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే కొన్ని కాలేజీలలో జూనియర్లను ర్యాగింగ్ పేరుతో భాదిస్తున్నారు. వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం (KU Ragging)లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై రెచ్చిపోయారు. కొత్త పరిచయాల పేరుతో జూనియర్లను వేధిస్తున్నారు.

KU Raggingలో 81 మంది సీనియర్ విద్యార్థుల సస్పెండ్

ర్యాగింగ్ చేసిన 81 మంది సీనియర్ విద్యార్థులపై హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపల్ చర్యలు తీసుకున్నారు. 81 మందిని వారంరోజుల పాటు హాస్టల్ నుంచి బహిష్కరించారు. కాకతీయ విశ్వవిద్యాలయం (KU Ragging) చరిత్రలో ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి. ర్యాగింగ్ చేసిన విద్యార్థినులందరూ కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగాలకు చెందిన వారే. వారిలో 28 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 28 మంది కామర్స్ విద్యార్థులు, 25 మంది ఎకనామిక్స్ విద్యార్థులు, ఇద్దరు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.

పరిచయాల పేరుతో వేధింపులు

కొత్తగా చేరిన విద్యార్థులని పరిచయాల పేరుతో సీనియర్లు వేధింపులకు గురి చేశారు. ఇది కాస్త పెద్దదవడంతో కొందరు బాధితులు కలిసి హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. దింతో ర్యాగింగ్‌కు పాల్పడుతున్న PG ఫైనల్ ఇయర్ విద్యార్థుల వివరాలు ఆరా తీశారు. క్యాంపస్‌లోని హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపల్‌, ఇతర అధికారులు కలిసి ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల వివరాలు సేకరించారు. ఈ తరహాలో క్యాంపస్ లోని అన్ని విభాగాల్లోని సీనియర్లు, జూనియర్లను వేధిస్తున్నట్లు తేలింది. దీంతో ర్యాగింగ్ చేసిన 81 మంది విద్యార్థులను సస్పెండ్ చేసారని యూనివర్శిటీ అధికారులు తెలిపారు.

ర్యాగింగ్‌కు గురైన విద్యార్థుల వివరాలు

ర్యాగింగ్‌కు గురైన విద్యార్థినులందరూ కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగాలకు చెందిన వారని తెలిపారు. దింతో క్యాంపస్ లోని హాస్టల్స్ కు ఈరోజు నుంచి క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. విద్యార్థినులందరూ వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని హాస్టల్ వార్డెన్ సూచించారు. క్యాంపస్ లో ఎవరు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఏ యే విభాగాలు, హాస్టళ్లలో ర్యాగింగ్ చేస్తున్నారో అనే వివరాలు సేకరిస్తున్నామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

సరైన ఆధారాలు లభిస్తే వారినీ కాలేజీ నుండి సస్పెండ్‌ చేస్తామని, ఎవర్ని వదిలిపెట్టేది లేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అయితే, ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో యువతులపై సస్పెన్షన్ వేటు పడటం కాకతీయ యూనివర్శిటీ (KU Ragging)లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకూ ర్యాగింగ్ అంటే అబ్బాయిలు మాత్రమే చేసేవాళ్ళు. తాజాగా, ఇప్పుడు ర్యాగింగ్‌కు పాల్పడిన వారిలో అమ్మాయిల పేర్లు రావడం చర్చనీయాంశంగా మారింది.

గతేడాది ప్రీతి ఆత్మహత్య

KUలో విద్యార్థినులకు వసతి కల్పించడం కోసం 5 హాస్టల్స్ ఏర్పాటు చేశారు. పద్మాక్షి A, B, C, D, అనే బ్లాక్ లు విద్యార్థినుల కోసం కేటాయించారు. వాటిల్లో రెగులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు సంబంధించిన దాదాపు 1,800 మంది విద్యార్థినులు హస్టల్ లో ఉంటున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)లో ర్యాగింగ్ దుమారం రేపింది. సీనియర్ల వేధింపుల వల్ల డాక్టర్ ప్రీతి సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత వేధింపులకు పాల్పడిన నిందితుడు సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Also Read: Raging: జూనియర్‌ని ర్యాగింగ్ చేసినందుకు 60 మంది పారామెడికల్ విద్యార్థులు సస్పెండ్