Home   »  నేరాలు   »   గచ్చిబౌలి స్టార్ హోటల్‌లో డ్రగ్స్‌తో విందు.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్‌

గచ్చిబౌలి స్టార్ హోటల్‌లో డ్రగ్స్‌తో విందు.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్‌

schedule ranjith

గచ్చిబౌలి | హైదరాబాద్‌ పోలీసులు గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న BJP నేత కుమారుడితో సహా మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Gachibowli | Dinner with drugs at Gachibowli Star Hotel..BJP leader's son arrested

Gachibowli | పోలీస్ అధికారుల వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌ (Radisson Hotel) లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. కాగా, ఓ BJP నేత కుమారుడు నిన్న రాత్రి వారి స్నేహితులకు విందు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో విందులో కొకైన్‌ తీసుకున్నట్టు గుర్తించారు. పోలీసులు హోటల్‌లోని కొకైన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో BJP నాయకుడి కుమారుడితో సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం వారు ముగ్గురు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. ఇక ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Also Read | గంజాయితో పట్టుబడిన బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్​ సోదరుడు