Home   »  నేరాలు   »   Iphones Seized in Abids: ఐఫోన్ల విక్రయాలలో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Iphones Seized in Abids: ఐఫోన్ల విక్రయాలలో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

schedule ranjith

హైదరాబాద్ | IPhones కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

iPhones Seized in Abids: Man arrested for cheating in sale of iPhones

హైదరాబాద్ లోని అబిడ్స్​లో ఘటన

Iphones Seized in Abids | ఇద్దరు యువకులు హోల్​సేల్​ ధరలో పెద్ద మొత్తంలో IPhones కావాలని ఫోన్ ​షాపు యాజమానికి కాల్​ చేశారు. తాము చెప్పిన ప్రాంతానికి వాటిని కొరియర్ పంపాలని అడ్రస్​ పంపారు. ఇదంతా నిజమని నమ్మిన ఫోన్​ షాపు యాజమాని వారు చెప్పినట్లుగా చేశాడు. తీరా IPhones​ పంపించాక, వారివద్దనుండి ఎటువంటి సమాధానం లేకపోవడంతో యజమాని షాకయ్యాడు. తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన అబిడ్స్​లో చోటుచేసుకుంది.

102 Iphones Seized in Abids

IPhones కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.64 లక్షల విలువ చేసే 102 ఐఫోన్‌లను సీజ్ చేశారు. అబ్దుల్లా విరాని అనే వ్యక్తికి మార్కెట్‌లో ఓ మొబైల్ షాప్ ఉంది. గుజరాత్‌కు చెందిన విపుల్‌, నిరావ్‌రాజ్ అనే ఇద్దరు వ్యక్తులు హోల్‌సేల్‌గా IPhones కావాలని అబ్దుల్లా విరానిని గతేడాది నవంబర్‌ 29న కోరినట్లు పోలీసులు తెలిపారు.

సెల్‌ఫోన్లు అందగానే డబ్బులు ఖాతాకు బదిలీ చేస్తామని నిందితులు నమ్మబలికారని వెల్లడించారు. వారి మాటలు నమ్మిన మొబైల్‌ షాపు నిర్వాహకుడు అబ్దుల్లా విరాని 107 ఐ ఫోన్‌లను వారు చెప్పిన చిరునామాకు కొరియర్ చేశాడు. ఫోన్లు తీసుకున్న నిందితులు, రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకుండా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గతేడాది డిసెంబర్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు

కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గుజరాత్​కు పంపించారు. గుజరాత్​లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, A2గా ఉన్న నిరావ్‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 102 ఐఫోన్‌లను సీజ్ చేశామని DCP శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. పరారీలో ఉన్న A1 నిందితుడు విపుల్‌ను త్వరలోనే పట్టుకుంటామని DCP స్పష్టం చేశారు.

Also Read: visakhapatnam: విశాఖలోని మోహిని థియేటర్‌లో భారీ చోరీ