Home   »  నేరాలు   »   Vinayakan: జైలర్‌ మూవీ విలన్‌ వినాయకన్‌ అరెస్ట్‌..

Vinayakan: జైలర్‌ మూవీ విలన్‌ వినాయకన్‌ అరెస్ట్‌..

schedule ranjith

సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కి, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘జైలర్‌’ మూవీ. ఈ చిత్రంలో విలన్‌గా చేసిన వినాయకన్‌ తన నటనతో సినిమాకు ఎంతో పేరు తెచ్చాడు. తాజాగా ఈ నటుడిని కేరళ పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

తమను ఇబ్బంది పెడుతున్నాడంటూ అపార్ట్‌మెంట్‌వాసుల ఫిర్యాదు

వివాదాలను అలవాటుగా చేసుకున్న ‘జైలర్’ సినిమా విలన్ వినాయకన్ మరో వివాదంలో చిక్కుకుని అరెస్ట్ కు గురయ్యారు. మద్యం మత్తులో గొడవకు దిగిన ఆయనను కేరళలోని ఎర్నాకుళం టౌన్ నార్త్ అధికారులు నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించిన పోలీసులు

పోలీసులు ఆయనను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వినాయకన్ వారితో గొడవ పెట్టుకున్నాడు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యారు.

గతంలో ఓ మోడల్‌ను వేధించిన కేసులో Vinayakan అరెస్ట్

వినాయకన్ అరెస్ట్ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ మోడల్‌ను వేధించిన కేసులో అరెస్టై బెయిలుపై బయటకు వచ్చాడు. మలయాళం సినీ పరిశ్రమకు చెందిన వినాయకన్ కల్యాణ్‌రామ్ సినిమా ‘అసాధ్యుడు’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ మరో తెలుగు సినిమా చేయలేదు.

Also Read: నేటి నుంచి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర