Home   »  నేరాలు   »   నకిలీ గల్ఫ్ జాబ్ ఏజెంట్ల పట్ల జాగ్రత్త.. హెచ్చరిస్తున్న నిజామాబాద్ పోలీసులు

నకిలీ గల్ఫ్ జాబ్ ఏజెంట్ల పట్ల జాగ్రత్త.. హెచ్చరిస్తున్న నిజామాబాద్ పోలీసులు

schedule raju

Gulf job agents | నిజామాబాద్‌ జిల్లాలో గల్ఫ్ జాబ్ ఏజెంట్లు, అనుమతులు లేని ఏజెన్సీలు కార్యకలాపాలు నిర్వహిస్తూ అమాయకులను, నిరుద్యోగులను మోసపూరితంగా ఉద్యోగావకాశాల వలలో వేసుకుంటున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో నిజామాబాద్ పోలీసు కమిషనర్‌ కల్మేశ్వర్‌ శింగేనవార్‌ తెలిపారు.

Police warn to be wary of fake Gulf job agents

నిజామాబాద్‌: గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కల్పిస్తామని చెబుతున్న జాబ్‌ ఏజెంట్ల (Gulf job agents) బారిన పడవద్దని నిజామాబాద్ పోలీసు కమిషనర్‌ కల్మేశ్వర్‌ శింగేనవార్‌ హెచ్చరించారు. జిల్లాలో గల్ఫ్ జాబ్ ఏజెంట్లు, అనుమతులు లేని ఏజెన్సీలు కార్యకలాపాలు నిర్వహిస్తూ అమాయకులను మోసపూరిత ఉద్యోగావకాశాల వలలో వేసుకుంటున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో శింగేనవార్‌ తెలిపారు. నకిలీ జాబ్ లెటర్లు ఇచ్చి గల్ఫ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు.

అటువంటి ఏజెంట్లు మరియు ఏజెన్సీల గురించి ముందే వివరాలను సేకరించాలని మరియు పోలీసుల నుండి అనుమతి పొందిన తర్వాత మాత్రమే వారికి ఇల్లు లేదా దుకాణ సముదాయాన్ని అద్దెకు ఇవ్వాలని కమిషనర్ ప్రజలకు సూచించారు. జిల్లాలో నకిలీ ఏజెంట్ల ఆగడాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను ఆయన కోరారు.

Also Read: డీప్‌ఫేక్ టెక్నాలజీతో 200 కోట్లు కొట్టేసిన స్కామర్‌లు.!