Home   »  నేరాలు   »   గంజాయితో పట్టుబడిన బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్​ సోదరుడు

గంజాయితో పట్టుబడిన బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్​ సోదరుడు

schedule ranjith

shanmukh | బిగ్​బాస్​ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్​ షణ్ముఖ్​ జశ్వంత్ సోదరుడు సంపత్​ వినయ్​ ఇంట్లో పోలీసులు గంజాయిని గుర్తించారు. యువతిని మోసం చేసిన కేసులో విచారణకు వచ్చిన పోలీసులకు వినయ్ ఇంట్లో గంజాయి దొరికింది.

Shanmukh | Brother of Bigg Boss fame Shanmukh who was caught with ganja

బిగ్​బాస్​ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్​ షణ్ముఖ్జశ్వంత్ సోదరుడు సంపత్​ వినయ్​ ఇంట్లో పోలీసులు గంజాయిని గుర్తించారు. వెంటనే అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో షణ్ముఖ్​ సోదరుడు మోసం చేశాడని అతనిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ కోసం పుప్పాలగూడలోని సంపత్​ ఇంటికెళ్లిన నార్సింగి పోలీసులు గంజాయిని గుర్తించారు.

వినయ్ వద్ద నుంచి 16 గ్రాముల గంజాయి స్వాధీనం (shanmukh)

సంపత్ వినయ్ వద్ద నుండి 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో పాలీసులు సంపత్ వినయ్ తోపాటు షణ్ముఖ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లోనే గంజాయి దొరకటంతో ఇద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం.

Also Read | Drugs Seized In Pune | పుణెలో 600 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం