Home   »  నేరాలు   »   హనుమకొండ: 16 ఏళ్ల బాలికపై SI అత్యాచారం

హనుమకొండ: 16 ఏళ్ల బాలికపై SI అత్యాచారం

schedule ranjith
Hanamkonda | SI rapes 16-year-old girl in Hanumakonda

Hanamkonda | ప్రజల మానప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన SI ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నిందితుడిపై హనుమకొండ జిల్లా KU పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం అత్యాచారం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భూపాలపల్లి SIగా ఉన్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ SIగా పనిచేశాడు.

Hanamkonda | సంపత్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు

ఆ సమయంలో హనుమకొండలోని ఓ కాలనీకి చెందిన మహిళతో సన్నిహితంగా మెలిగాడు. ఖమ్మం జిల్లాకు CIగా బదిలీ అయ్యాక కూడా వారి సాన్నిహిత్యం కొనసాగింది. ఇటీవల జైశంకర్ భూపాలపల్లికి VR SIగా బదిలీపై వచ్చిన అతడు మహిళ కూతురిపై కన్నేశాడు. అతడు బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి ఒడిగట్టాడు. తల్లికి బాలిక విషయం చెప్పడంతో ఆమె KU పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Also Read | Fake RPF SI | తెలంగాణలో RPF మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ పేరుతో మోసం..!