Home   »  నేరాలు   »   జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల మెరుపుదాడి.. 5గురు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల మెరుపుదాడి.. 5గురు జవాన్లు మృతి

schedule mahesh

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పూంచ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఆర్మీ జవాన్ల వాహనాలే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు (Terrorist attack) తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

Terrorist attack

జమ్మూకశ్మీర్‌లో Terrorist attack

మరో జవాన్లు ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు అదనపు బలగాలను డేరా కీ గాలీ ప్రాంతానికి తరలిస్తుండగా ధాత్యార్ మోర్ వద్ద ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. సైనికులు ప్రయాణిస్తున్న ట్రక్కు, జిప్సీ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, సైనికుల ఆయుధాలను ఎత్తుకెళ్లి ఉంటారని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి.

అదనపు బలగాలను తరలిస్తుండగా ముష్కరుల ఆకస్మిక దాడి

ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు బుధవారం రాత్రి నుండి డెరాఖీ గలీ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో ఘటన స్థలానికి అదనపు బలగాలను తరలిస్తుండగా ముష్కరులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారని ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ కొనసాగుతుందని వెల్లడించారు.

ఈ ఉగ్రదాడిలో 5గురు జవాన్లు మృతి

పూంఛ్‌ జిల్లాలో బుధవారం ఒక పోలీస్‌ యూనిట్‌ ప్రాంగణంలో పేలుడు సంభవించిన తర్వాత ఈ ఉగ్ర దాడి జరగడం ఆందోళన కలిగిస్తుంది. గత నెలలో రాజౌరీ జిల్లాలోని కలకోట్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో ఇద్దరు కెప్టెన్లతో సహా ఐదుగురు సైనికులు మరణించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారడంతో పాటు సైన్యంపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడుల్లో 10 మంది సైనికులు అమరులయ్యారు. 2003 మరియు 2021 మధ్య, ఈ ప్రాంతం తీవ్రవాద రహితంగా ఉంది. ఆ తర్వాత తరచూ ఎన్‌కౌంటర్లు జరగడం మొదలైంది. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో జరిగిన వివిధ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో 35 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Also Read: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం… CISF చేతుల్లోకి పార్ల‌మెంట్ భ‌ద్ర‌త