Home   »  ఉద్యోగం   »   ఎంసెట్ BIPC కౌన్సిలింగ్ ప్రారంభం

ఎంసెట్ BIPC కౌన్సిలింగ్ ప్రారంభం

schedule sirisha

తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు బీఫార్మసీ, ఫార్మా డీ తదితర సీట్లను కేటాయించేందుకు BIPC కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న (ఈ రోజున) అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోవాలి. 4, 5 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. కన్వీనర్ కోటా కింద మొత్తం ఐదు రకాల కోర్సుల్లో 8,312 సీట్లను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 114 కాలేజీల్లో 6 వేల 910 బీఫార్మసీ సీట్లు, 61 కళాశాలల్లో 1191 ఫార్మ్ డీ సీట్లు ఉన్నాయి.

ఎంసెట్ BIPC 2023 కౌన్సెలింగ్ సమయంలో తీసుకురావలసిన సర్టిఫికెట్లు

  • TSEAMCET -2023 ర్యాంక్ కార్డ్
  • TSEAMCET -2023 హాల్ టికెట్
  • ఆధార్ కార్డ్
  • SSC మార్కుల మెమో
  • ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్
  • 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్లు
  • బదిలీ సర్టిఫికేట్ (TC)
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • 2023-24 సంవత్సరానికి తహశీల్దార్ జారీ చేసిన EWS సర్టిఫికేట్
  • కుల ధృవీకరణ పత్రం