Home   »  వినోదం   »   జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. చరిత్ర సృష్టించిన ‘పుష్పరాజ్

జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. చరిత్ర సృష్టించిన ‘పుష్పరాజ్

schedule raju

ప్రముఖ నటులు అల్లు అర్జున్ (Allu Arjun), కృతి సనన్‌ (Kriti Sanon).. ఉత్తమ నటులుగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు దక్కించుకున్న విషయం తెలిసేందే. అయితే ‘పుష్ప (Pushpa)’ సినిమాకు బన్నీ, ‘మిమి (Mimi)’ సినిమాకు కృతి సనన్‌ ఉత్తమ నటులుగా అవార్డులు సాధించుకున్నారు.

కృతి, బన్నీ తీసుకున్న సెల్ఫీ నెట్టింట వైరల్‌

అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కృతి, బన్నీ పక్కపక్కనే కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా.. ‘తగ్గేదే లే’ అన్న పోజులో ఇద్దరూ ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. తమ ప్రియతమ యాక్టర్లను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. దీంతో, ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వేడుకల్లో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా వచ్చారు. ఆలియా తన పెళ్లిలో కట్టుకున్న చీరతో అవార్డు ప్రదానోత్సవానికి వచ్చింది. ఇక ‘మిమి’ చిత్రానికి గాను పంకజ్ త్రిపాఠీ ఉత్తమ సహాయక నటుడి అవార్డును అందుకున్నాడు.

రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్న Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ క్రియేట్ చేసిన విషయం తెలిసేందే. అయితే పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టిన అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నిన్న (అక్టోబరు 17)న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నాడు.

ఇక “పుష్ప: ది రైజ్” (Pushpa 1) సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న “పుష్ప: ది రూల్” (Pushpa 2) షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ మూవీని (Pushpa 2) వచ్చే ఏడాది ఆగస్టు 15 న విడుదల చేయనున్నారు. పుష్ప సినిమా ముందుగా అనుకున్నట్లు రెండు భాగాలే కాకుండా మూడో పార్ట్ కూడా రాబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా నడుస్తున్నది.

పుష్ప-3 తీయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్

పుష్ప సినిమా మొత్తం స్టోరీని చెప్పడానికి రెండు భాగాలు సరిపోవని, ఈ సినిమా కథ చాల పెద్దదని దీంతో మూడో భాగం కూడా తీయాలని దర్శక, నిర్మాతలు యోచిస్తున్నట్లు సినిమా వర్గాలలో వార్తలొస్తున్నాయి. అయితే పుష్ప-3 షూటింగ్ కి మాత్రం బాగా టైమ్ పడుతుందని అంటున్నారు. ఎందుకంటే బన్నీ ఇప్పటికే వేరే రెండు ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పాడు.

Also Read: National Award: జాతీయ అవార్డ్ అందుకోవ‌డానికి దిల్లీకి బయల్దేరిన బ‌న్ని