Home   »  వినోదం   »   మృణాల్ ఠాకూర్ పెళ్లిపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు… వైరల్ అవుతున్న న్యూస్

మృణాల్ ఠాకూర్ పెళ్లిపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు… వైరల్ అవుతున్న న్యూస్

schedule raju

సీతారాం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న మృణాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం విజయ్ దేవరకొండ మరియు నానితో హాయ్ నాన్న (Hi Nana), ఫ్యామిలీ స్టార్ (Family Star) మూవీలలో నటిస్తోంది.

త్వరలో హైదరాబాద్ కు కోడలుగా రానున్న Mrunal Thakur

అయితే ఇప్పుడు మృణాల్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ హీరోతో మృణాల్ ప్రేమలో ఉందనే వార్త వైరల్ అవుతోంది. త్వరలో ఆమె హైదరాబాద్‌లో కోడలుగా అడుగుపెట్టనుంది సమాచారం.

దీనికి సంబంధించి సైమా అవార్డు వేడుకలో అల్లు అరవింద్ (Allu Aravind) వ్యాఖ్యలు చేశారు. మృణాల్ త్వరలో హైదరాబాద్ కోడలు కాబోతుందంటూ మృణాల్ పై వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ లావణ్యపై కూడా అల్లు అరవింద్ వ్యాఖ్యలు

గతంలో హీరోయిన్ లావణ్య (Lavanya Tripathi)పై కూడా అల్లు అరవింద్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మృణాల్ విషయంలోనూ అదే వ్యాఖ్యలు చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మృణాల్ విషయంలో అరవింద్ వ్యాఖ్యలు నిజమవుతాయా? అనే చర్చ జరుగుతోంది.

ఇక మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) విషయానికొస్తే.. బుల్లితెరపై సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ మరాఠీ చిత్రం ‘విట్టి దండు’ (Vitti Dandu) సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. ఆ తర్వాత మరాఠీతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

సెల్ఫీ సినిమాలో మృణాల్

సీతారామ్ తర్వాత, మృణాల్ ఈ సంవత్సరం అక్షయ్ కుమార్ నటించిన ‘సెల్ఫీ’ (Selfiee) సినిమాతో అందరిని అలరించింది. ఈ సినిమా మలయాళంలో వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్‌కి రీమేక్. ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టలేదు. ఈ సినిమాతో అక్షయ్‌ కుమార్‌ స్టార్‌డమ్‌పై సందేహం నెలకొంది.

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘గుమ్రా’ (Gumraah) సినిమాలో కూడా మృణాల్ నటించింది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. అలాగే ‘లస్ట్ స్టోరీస్ 2’లో మృణాల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇది కాకుండా హిందీలో చాలా సినిమాలు వచ్చాయి.

Also Read: మంచు విష్ణు నటిస్తున్న “కన్నప్ప” సినిమాకు బ్రేక్…