Home   »  వినోదం   »   ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా రిలీజ్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా రిలీజ్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

schedule raju

చెన్నై: ధనుష్ (Dhanush) నటించిన ‘కెప్టెన్ మిల్లర్ (Captain Miller)’ సినిమా వాయిదా పడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే, ఈ సినిమాను డిసెంబరు 15న విడుదల చేయాలనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల కెప్టెన్ మిల్లర్ సినిమా విడుదల తేదీని మార్చారు.

Captain Miller సినిమా సంక్రాంతి సందర్బంగా విడుదల

‘సాని కైధం (Saani Kaayidham)’, ‘రాకీ (Rocky)’ చిత్రాలకు దర్శకత్వం వహించిన అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheswaran) దర్శకత్వంలో ధనుష్ నటించిన చిత్రంకెప్టెన్ మిల్లర్ (Captain Miller)’. ఈ పీరియాడిక్ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. సత్యజ్యోతి ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) కథానాయికగా నటిస్తోంది. సందీప్ కిషన్, నివేద సతీష్, జాన్ కాకేన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 3 భాగాలుగా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శివరాజ్ కుమార్ కి సంభందించిన సినిమా షూటింగ్ జూలై 19న పూర్తయింది.

ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న విడుదల చేయనున్నామని ప్రకటించినా ఇప్పుడు విడుదల తేదీని మార్చారు. దీని ప్రకారం, చిత్ర నిర్మాణ సంస్థ, సత్య జ్యోతి ఫిల్మ్స్, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. శివకార్తికేయన్ ‘అయలాన్’, ఐశ్వర్య రజనీకాంత్ ‘లాల్ సలామ్’ మరియు సుందర్ సి ‘అరణ్మనై 4’ సంక్రాంతికి విడుదల కానున్నాయి. బి. రంజిత్ – విక్రమ్ ల ‘తంగళన్’ జనవరి 26న విడుదల కానుంది.

Also Read: నందమూరి బాలకృష్ణ ‘NBK109’ షూటింగ్ ప్రారంభం