Home   »  వినోదం   »   విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థంపై క్లారిటీ.!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థంపై క్లారిటీ.!

schedule raju

Rashmika – Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించారు.

Clarity onRashmika - Vijay Devarakonda engagement

Rashmika – Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా నటీనటులకు సంభందించిన సన్నిహిత వర్గాలు సోమవారం ఈ వార్తలు కేవలం కల్పితమని పేర్కొన్నాయి.

కొన్ని నివేదికల ప్రకారం.. “నటీనటులు డేటింగ్ చేస్తున్నారని, అయితే వారు తమ మధ్య సంబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు”. వీరిద్దరూ కలిసి ‘గీత గోవిందం‘, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించారు.

రష్మిక ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’ విజయంతో దూసుకుపోతోంది. ఇందులో ఆమె రణబీర్ కపూర్ సరసన నటించింది. ఆమె తర్వాత ‘పుష్ప 2: ది రూల్’, ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మరియు ‘చావా’ తదితర చిత్రాలలో నటిస్తుంది. కాగా, చివరిసారిగా ‘కుషి’లో కనిపించిన విజయ్, తన తదుపరి ‘ఫ్యామిలీ స్టార్’ మరియు ‘VD 13’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Also Read: VD13: సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.!