Home   »  వినోదం   »   Devara OTT Rights: భారీ ధరకు దేవర ఓటీటీ రైట్స్‌.. రికార్డ్ ధ‌ర‌కు డీల్ సెట్‌

Devara OTT Rights: భారీ ధరకు దేవర ఓటీటీ రైట్స్‌.. రికార్డ్ ధ‌ర‌కు డీల్ సెట్‌

schedule raju

Devara OTT Rights: ఎన్టీఆర్ మరియు కొరటాల శివల రాబోయే పాన్-ఇండియన్ చిత్రం దేవర ఏప్రిల్ 5, 2024న విడుదల చేయనున్నట్లు విస్తృతంగా తెలుస్తుంది. దేవర సినిమా షూటింగ్ పూర్తికాక‌ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ (Devara OTT Rights) రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన‌ట్లు వార్తలొస్తున్నాయి.

అయితే దేవ‌ర సినిమా అన్ని భాషల దేవర ఓటీటీ హక్కుల (Devara OTT Rights)ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 90 కోట్ల‌కు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా డిజిట‌ల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌ పోటీపడగా చివ‌ర‌కు నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న‌ట్లు సమాచారం. కేవలం స్ట్రీమింగ్‌ రైట్స్‌కే ఈ రేంజ్‌లో ధర పలికిందంటే, ఇక ఆడియో రైట్స్‌ కూడా టీ సిరీస్‌ సంస్థ భారీ స్థాయి బడ్జెట్ తో సొంతం చేసుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ఎన్టీఆర్ దేవర సినిమా ఓటీటీ బిజినెస్ (Devara OTT Rights) క్లోజ్

సినిమా పూర్తికాకముందే ఓటీటీ బిజినెస్ క్లోజ్ కావ‌డం ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్‌అని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవ‌ర‌ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను కూడా టీ సిరీస్ సంస్థ కొనుగులు చేసిన‌ట్లు టాక్. ఈ సినిమాలో NTRకు జోడీగా జాన్వీకపూర్‌ నటిస్తుంది. జాన్వీకి సంబంధించిన కీలక షూట్‌ ఈ నెలాఖరులో మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ ప్రయత్నాలు జరుపుతున్నారు.

ఇందులో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ పాత్ర పోషిస్తున్నాడు. దేవ‌ర‌తో జాన్వీక‌పూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టివ‌ర‌కు 70 శాతం పూర్తయింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండవ సినిమా దేవర.

అంతకముందు జ‌న‌తా గ్యారేజ్ సినిమా వీరిద్దరి కాంబినేష‌న్‌లో తెరకెక్కినది. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఎన్టీఆర్‌కు క్రేజ్ ఏర్ప‌డింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ దేవ‌ర‌ను తెలుగు, హిందీతో పాటు మిగిలిన ద‌క్షిణాది భాష‌ల్లో పెద్ద‌ ఎత్తున రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Also Read: Hanuman: హనుమాన్ సినిమా సంక్రాంతి రేసు నుండి ఔట్… అసలేమైందంటే.?