Home   »  వినోదం   »   ‘డబుల్‌ ఇస్మార్ట్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

‘డబుల్‌ ఇస్మార్ట్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

schedule raju

Double iSmart Release Date | టాలీవుడ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో ఇస్మార్ట్‌శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’ సినిమా గురించి ఓ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Double iSmart Release Date fixed

టాలీవుడ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), రామ్‌ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డ‌బుల్ ఇస్మార్ట్‌'(Double Ismart). రామ్ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని అందించిన సినిమాగా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది. దీనికి సీక్వెల్ గా వస్తున్న ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’ గురించి ఓ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.

Double iSmart Release Date

ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకముందు మార్చి 08న గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ విడుద‌ల తేదీ వాయిదా పడింది. అయితే, సినిమా షూటింగ్ ఆల‌స్యం అవ్వ‌డం, అనుకున్న టైమ్‌కి పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు పెండింగ్ ఉండ‌డంతో ఈ సినిమాను జూన్‌ 14న విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్ చేస్తున్న‌ట్లు సమాచారం.

అయితే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మీ కౌర్‌తో కలిసి పూరీ జగన్నాథ్‌ నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Double ISMART: పూరీ పుట్టినరోజు సందర్భంగా డబుల్ ఇస్మార్ట్’ నుంచి స్పెషల్ పోస్టర్.!