Home   »  వినోదం   »   50 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈగల్ సినిమా..

50 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈగల్ సినిమా..

schedule mahesh

Eagle movie | రవితేజ హీరోగా నటించిన “ఈగల్” సినిమా ఈ నెల 9న విడుదలై మంచి విజయం సాధించింది. తొలి రోజున ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొంది. ఆ తరువాత కూడా పోటీ ఇచ్చేంత స్థాయి సినిమాలేవి రాకపోవడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చింది.

eagle-movie-has-entered-the-50-crore-club

Eagle movie | రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ ఈ నెల 9న విడుదలై మంచి విజయం సాధించింది. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటించగా, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించింది.

తాజాగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్‌లో చేరింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ కొంతసేపటి క్రితం విడుదల చేసింది. ‘ఈగల్’ సినిమా థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాదించింది. కొత్త లుక్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా యాక్షన్-ఎమోషన్ సీన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేసిన విధానం ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది.

తొలి రోజున ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొంది. ఆ తరువాత కూడా పోటీ ఇచ్చేంత స్థాయి ఏ సినిమాలు రాకపోవడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చింది. వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా, ఎమోషన్స్ పరంగా కంటే యాక్షన్ పరంగానే పేక్షకుల మనసును గెలుచుకుంది.

Also Read | పుష్ప-3 సినిమాపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!