యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర‘ నుంచి అప్డేట్ వచ్చేసింది. దేవర సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇప్పటికే ఎన్టీఆర్, జాన్వీకపూర్ లుక్ రిలీజ్ అవ్వగా.. తాజాగా సైఫ్ అలీ ఖాన్ లుక్ రిలీజ్ అయింది.
దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. భైరా అనే పాత్ర చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు రిలీజ్ అయింది. సైఫ్ ఇంటెన్స్ లుక్ ఆసక్తికరంగా ఉంది. భీకర అలల మధ్య కొందరు పడవలు నడుపుతున్న దృశ్యం కూడా ఈ పోస్టర్లో ఉంది. ఈ సినిమాలో దేవర, భైరా మధ్య పోరు తీవ్రంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. భైరా ఫస్ట్ లుక్ పోస్టర్ను జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే సైఫ్ సర్!” అని పోస్ట్ చేశారు.