Home   »  వినోదం   »   దిల్‌రాజు కు.. జైలర్‌తో కళ్లుచెదిరే లాభాలు..

దిల్‌రాజు కు.. జైలర్‌తో కళ్లుచెదిరే లాభాలు..

schedule ranjith

జైలర్ కలెక్షన్స్ | రిలీజై వారం దాటుతున్నా ఇంకా జైలర్‌ హవా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తమిళ, తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో జైలర్‌ సృష్టిస్తున్న ప్రకంపనలు అంతా ఇంతా కాదు. దాంతో జైలర్‌ సినిమాకు అంత క్రేజ్‌ ఉన్నా.. తెలుగులో మాత్రం రూ.12 కోట్లకు బిజినెస్‌ లెక్కలను క్లోజ్‌ చేసుకుంది. దిల్‌రాజు ఏషియన్‌ సునీల్‌ నారంగ్‌ తో కలిసి ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేశాడు. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా తెలుగులో బ్రేక్‌ ఈవెన్‌ మార్క్‌ను దాటేసింది. ఇక మూడో రోజు నుంచి లాభాల బాట పట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఒక్క తెలుగులోనే రూ.46.99 కోట్లకు పైగా కలెక్షన్‌లు వచ్చాయి. . ఇక ఈ సినిమా స్పీడ్‌ చూస్తుంటే మరో 20 కోట్ల షేర్‌ ఈజీగా రాబట్టే విధంగా అనిపిస్తుంది. పైగా ఖుషీ రిలీజయ్యే వరకు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ పోటీగా ఒక్క సినిమా కూడా లేదు. ఈ లెక్కన దిల్‌రాజుకు తిరుగులేని లాభాలు రావడం ఖాయం.