Home   »  వినోదం   »   రేపు OTTలోకి రానున్న 4 భారీ చిత్రాలు..!

రేపు OTTలోకి రానున్న 4 భారీ చిత్రాలు..!

schedule mahesh

OTT Release | గ‌త రెండువారాలుగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాలేవీ థియేటర్లలో లేకపోవడంతో సినీ ప్రేక్షకులు OTTల బాట పట్టారు. అయితే OTTలలో కూడా కొత్త వెబ్ సిరీస్‌లు కానీ మూవీలు కానీ విడుద‌ల కాలేదు. అయితే ప్రేక్షకుల నిరీక్షణకు తెరదించుతూ రేపు 4 భారీ పెద్ద సినిమాలు OTTలోకి రానున్నాయి.

four-big-movies-coming-to-ott-release-tomorrow

OTT Release | గ‌త రెండువారాలుగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాలేవీ థియేటర్లలో లేకపోవడంతో ప్రేక్షకులు OTTకి షిఫ్ట్ అయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో OTTలో కొత్త వెబ్ సిరీస్‌లు కానీ మూవీలు (OTT Release) కానీ విడుద‌ల కాలేదు. అయితే సినీ ప్రేక్షకుల నిరీక్షణకు తెరదించుతూ ఈ వారం 4 భారీ సినిమాలు OTTలోకి రాబోతున్నాయి.

ఫిబ్రవరి 9న OTTలోకి రానున్న గుంటూరు కారం

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా OTT విడుదలకు (OTT Release) సిద్ధమైంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో ఫిబ్రవరి 9 నుండి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

ఫిబ్రవరి 8న OTTలోకి రానున్న కెప్టెన్ మిల్లర్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ భామ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ పాత్రలో నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన తమిళనాడులో మంచి విజయాన్ని సాధించింది. తెలుగులో జనవరి 26న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే థియేటర్ లలో ఆకట్టుకున్న ఈ సినిమా తాజాగా OTTని లాక్ (OTT Release) చేసుకొంది. ఈ సినిమా ఫిబ్రవరి 08 నుండి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం కాబోతుంది.

ఫిబ్రవరి 9న OTTలోకి రానున్న అయలన్

కోలీవుడ్ స్టార్ నటుడు శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘అయలన్’. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన OTT ప్రకటన విడుదలైంది. ‘అయలన్’ ఫిబ్రవరి 9 నుండి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్‌లో ప్రసారం కాబోతుంది. అయితే ఈ సినిమా OTTలో తమిళ వెర్షన్‌లో మాత్రమే విడుదల కానుంది.

OTTలోకి రానున్న ది మార్వెల్స్ సినిమా

మార్వెల్ మూవీస్ ఈ బ్యానర్ నుండి సినిమా వ‌స్తుందంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్వెల్ అభిమానులు పండుగ చేసుకుంటారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి బ్లాక్ పాంథర్, ది ఎవెంజర్స్, స్పైడర్ మ్యాన్ మరియు కెప్టెన్ అమెరికా వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. అయితే గతేడాది మార్వెల్ స్టూడియోస్ నుండి వచ్చిన ‘ది మార్వెల్స్’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. నియా డకోస్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 10న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది.

Also Read | ప్రభాస్ కల్కి 2898 AD నుండి అప్‌డేట్.. త్వరలో రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ..!