Home   »  వినోదం   »   ‘గాండీవ‌ధారి అర్జున’ మూవీ రివ్యూ.!

‘గాండీవ‌ధారి అర్జున’ మూవీ రివ్యూ.!

schedule raju

టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గాండీవ‌ధారి అర్జున మూవీ నేడు థియేట‌ర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఫ‌స్ట్ టైమ్ స్పై యాక్ష‌న్ క‌థ‌తో వ‌రుణ్‌తేజ్ చేసిన తాజా చిత్రం గాండీవ‌ధారి అర్జున. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ( అర్జున్ వర్మ) అనే పాత్రలో నటించారు.

అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ మంత్రి అయినా ఆచార్య (నాసర్) ని కొంతమంది చంపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆచార్య కి వాళ్ళు చేసే మెడికల్ స్కాం వల్ల మనుషులే కాదు పర్యావరణం కూడా దెబ్బ తింటుంది అని వాళ్ళని ఎలాగైనా ఆపాలి అని రా ఏజెంట్ అర్జున్ (వరుణ్ తేజ్ ) కి చెప్తాడు.

ఈ సినిమా ఓ మెడికల్ మాఫియాకి సంబంధించింది. భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ట్రీట్ మెంట్ పేరుతో మాఫియాకి ఎలా తెర లేపారు ? మన చుట్టూ ఉన్న ఆసుపత్రుల్లో ఇంత పెద్ద మాఫియా జరుగుతున్నప్పటికీ మనం తెలుసుకోలేకపోయామనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా వస్తోంది.

సినిమా రేటింగ్: 2.75/5