Home   »  వినోదం   »   శివరాత్రికి “హరిహర వీరమల్లు” స్పెషల్‌ ప్రోమో.!

శివరాత్రికి “హరిహర వీరమల్లు” స్పెషల్‌ ప్రోమో.!

schedule raju

Harihara veera mallu promo | పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతోన్న “హరిహర వీరమల్లు” సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. మూవీ టీమ్ ఈ సినిమా స్పెషల్‌ ప్రోమోను రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం.

Harihara veera mallu promo to be released on Shivratri

Harihara veera mallu promo | పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతోన్న “హరిహర వీరమల్లు” సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. మార్చి 8న శివరాత్రి కానుకగా ఈ సినిమా స్పెషల్‌ ప్రోమో (Harihara veera mallu promo)ను రిలీజ్‌ చేస్తున్నట్లు సమాచారం. రిలీజ్‌ డేట్‌ను కూడా అదే రోజు ప్రకటిస్తారని వినికిడి. అయితే, దీనిపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది.

రాబిన్‌హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్

మెగా సూర్య ప్రాడక్షన్‌ బ్యానర్‌పై A.M.రత్నం హరిహర వీరమల్లు సినిమాని నిర్మిస్తున్నారు. క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ డియోల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపిస్తున్నాడ‌ని వినిపిస్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని A.M.ర‌త్నం క్లారిటీ ఇచ్చాడు సింగిల్ క్యారెక్ట‌ర్‌లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపిస్తాడ‌ని తెలిపారు. సౌత్ ఆడియెన్స్ కంటే నార్త్ ఆడియెన్స్‌కు ఎక్కువ‌గా క‌నెక్ట్ అయ్యే అంశాలు హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లులో ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, ఇందులో రాబిన్‌హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపిస్తాడ‌ని తెలిపాడు.

అభిమానులకి మూవీ టీమ్ నోట్‌

పవర్ స్టార్ అభిమానులు మరియు సినీ ప్రేమికులందరికీ మూవీ టీమ్ ఒక నోట్‌ను కూడా విడుదల చేశారు. “ప్రస్తుతం ఇరాన్, కెనడా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి చోట్ల మా ప్రతిష్టాత్మక సినిమా హై ఎండ్ VFX వర్క్ జరుగుతోంది. కాబట్టి, దయచేసి వేచి ఉండండి మరియు థ్రిల్‌ను ఊహించండి! అతి త్వరలో, మేము ప్రత్యేక ప్రోమోను ప్రదర్శించబోతున్నాం” అని తెలిపారు.

Also Read: ‘పవన్‌ కళ్యాణ్‌’ అభిమానులకు గుడ్‌న్యూస్‌… త్వరలో సర్‌ప్రైజ్‌