Home   »  వినోదం   »   ‘ఖుషి’ సక్సెస్‌పై హీరో నాని స్పెషల్‌ ట్వీట్‌

‘ఖుషి’ సక్సెస్‌పై హీరో నాని స్పెషల్‌ ట్వీట్‌

schedule raju

విజయ్‌ దేవరకొండ, సమంత కాంబోలో వచ్చిన ‘ఖుషి’ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా ఈసినిమా భారీ విజయాన్ని పొందడంపై నేచురల్‌ స్టార్‌ నాని నటీనటులకు శుభాకాంక్షలు తెలియజేశారు. డైరెక్టర్‌ శివ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ను ఆయన అభినందించారు. చాలా సంతోషంగా ఉందని, అతి త్వరలోనే మూవీ చూస్తానని ఆయన ట్వీట్‌ చేశారు.

ఖుషి సినిమా దాదాపు రూ.50 కోట్ల ప్రీ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా మొదటి రోజు రూ. 9.50 నుంచి రూ.10.00 కోట్లు షేర్ వసూలు వచ్చినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.13.50 కోట్ల షేర్ అందుకుందట. దీంతో లైగర్​-శాకుంతలం వంటి భారీ డిజాస్టర్లు తరువాత కూడా అదిరిపోయే కలెక్షన్స్ అందుకున్నారు. దీంతో ఈ జంట సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా పాజిటీవ్ టాక్ రావడంతో రానున్న రెండు మూడు రోజుల్లో సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.