Home   »  వినోదం   »   Hi Nanna: “హాయ్ నాన్న” ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.!

Hi Nanna: “హాయ్ నాన్న” ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.!

schedule raju

Hi Nanna First Single Promo: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శౌర్యువ్‌ (Shouryuv) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “హాయ్ నాన్న” (Hi Nanna) . ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, ప్రోమోలు అభిమానులలో మంచి హైప్‌ తెచ్చిపెట్టాయి. పైగా దసరా వంటి మాస్‌ సినిమాల తర్వాత నవీన్ బాబు ఘంటా (నాని) ఓ క్లాసికల్ సినిమాతో రానుండటం అభిమానులను తీవ్ర ఉత్సాహానికి గురి చేస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతున్న ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ సినిమాపై బజ్‌ పెంచడానికి అప్పుడప్పుడు ఆసక్తికర అప్‌డేట్‌లు ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ను మూవీ టీం విడుదల చేశారు.

Hi Nanna ఫస్ట్ సింగిల్

హాయ్ నాన్న (Hi Nanna) మూవీ నుంచి మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కి సంబందించిన ప్రోమో ను రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 16న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. సమయమా అంటూ సాగే ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వహాబ్ కంపోజ్ చేశారు. తెలుగు తో పాటుగా, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ పాట అదే రోజున రిలీజ్ కానుంది.

ఇప్పుడు వస్తున్న సినిమాలో అయితే మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సినిమా పై మంచి హైప్ తీసుకురావాలి అంటే ముఖ్యంగా దాని ఫస్ట్ సింగిల్ అనేది చాలా ముఖ్యమైనది కాగా ఈ సాంగ్ హిట్ అయితే ఆటోమేటిక్ గా దానిపై మంచి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్… ఇంటర్నెట్‌లో వైరల్‌.

అలా ఇటీవలే విడుదలైన విజయ్ దేవరకొండ, సమంత నటించిన చిత్రం “ఖుషి” కి ఓ సాలిడ్ సాంగ్ అయితే ఓ పెద్ద హిట్ అందుకుంది.  కాగా ఈ సినిమాకి సంగీతం అందించిన మలయాళం సంగీత దర్శకుడు అబ్దుల్ వాహద్. కాగా ఇదే సంగీత దర్శకుడు నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా సీతారామం ఫేమ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించిన చిత్రంలో కూడా తన సంగీతాన్ని అందించాడు. మరి ఈ చిత్రం మళ్ళీ నాని కెరీర్ లో జెర్సీ తరహాలో నాన్న సెంటిమెంట్ తో కొత్త దర్శకుడు శౌర్యువ్ (Shouryuv) తెరకెక్కిస్తుండగా మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో దీనిని ప్లాన్ చేస్తున్నారు.

మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), కియారా ఖన్నా (Kiara Khanna) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (C V Mohan), విజేందర్ రెడ్డి తీగల (Vijender Reddy) నిర్మిస్తున్న ఈ చిత్రం ను డిసెంబర్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా తెలుగు తో పాటుగా, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.