Home   »  వినోదం   »   ఆ మూడు సినిమాలు నాకు నచ్చలేదు కానీ సలార్ నచ్చింది: ప్రశాంత్ నీల్

ఆ మూడు సినిమాలు నాకు నచ్చలేదు కానీ సలార్ నచ్చింది: ప్రశాంత్ నీల్

schedule mahesh

ప్రశాంత్ నీల్ | పాన్ ఇండియా స్టార్ హీరో, రెబెల్ స్టార్ ప్రభాస్ కాంపౌండ్ నుండి వస్తున్న అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ సలార్(Salaar). ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. సలార్ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.

salaar

డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న Salaar

సలార్ పార్ట్-1 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సలార్ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా వుంది. సలార్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో S.S రాజమౌళి చేసిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సలార్ నచ్చిందన్న ప్రశాంత్ నీల్

తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఏంటి అంటే ఇప్పటి వరకు KGF-1, 2, ఉగ్రం, మూడు సినిమాలు చేశాను. ప్రభాస్ తో చేసిన సలార్ నా నాలుగో సినిమా అన్నారు. ఆ మూడు సినిమాలు విడుదలకు వారం రోజుల ముందు నేను చూసాను కానీ అవి నాకు నచ్చలేదు. కానీ ఈసారి నా నాలుగోవ సినిమా సలార్ మాత్రం నాకు నచ్చిందన్నారు.

తన సోషల్ మీడియా అకౌంట్ తొలగించానన్న ప్రశాంత్ నీల్

ఈసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కామెంట్స్ వల్ల నేను ప్రభావితం కాకూడదనుకుంటున్నాను. కేజీఎఫ్-2ని 1,000 మంది పొగిడితే ఒక్కరు బాగోలేదని చెప్పారు. ఆ ఒక్క వ్యాఖ్య చాలా మంది ప్రశంసల కంటే నన్ను ఎక్కువ బాధించింది. అందుకే నా సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ తొలగించానని తెలిపాడు.

నాకు స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి సార్ అన్న ప్రశాంత్ నీల్

ప్రభాస్ లాంటి స్వచ్ఛమైన గుణాన్ని ఎవరు చూపించలేరు. అదే సమయంలో ప్రభాస్ కూడా తన దూకుడు చూపించగలరు. సలార్ విషయంలోనూ అదే క్వాలిటీని ఆశించాను. ప్రభాస్ వ్యక్తిత్వం సలార్‌కి చాలా సరిగ్గా సరిపోతుంది. ప్రభాస్ చాలా సౌమ్యుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిజంలో నాకు స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి సార్. 90లలో నాకు ఇష్టమైన హీరో చిరంజీవి. తన సినిమాలు హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తాయని అన్నారు.

సలార్‌కి A సర్టిఫికేట్ ఇవ్వడం గురించి మాట్లాడితే చాలా డిస్పాయింట్ అయ్యాను. 20 నిమిషాల పాటు సెన్సార్ బోర్డు ముందు కూర్చుండిపోయాను. నేను వల్గర్ సినిమా లేదా హింసాత్మక సినిమా చేయలేదన్నారు. సలార్‌లో చూపించినవన్నీ కథకు అవసరమైనమేరకే చూపించానని సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెలిపాడు.

Also Read: Hanuman Movie Trailer Out: హనుమాన్ సినిమా ట్రైలర్ విడుదల