Home   »  వినోదం   »   ‘జైభీమ్’ డైరెక్టర్ రజినీకాంత్ కొత్త చిత్రం ప్రారంభం!

‘జైభీమ్’ డైరెక్టర్ రజినీకాంత్ కొత్త చిత్రం ప్రారంభం!

schedule mounika

జైలర్’తో బాక్సాఫీసు షేక్ చేసిన రజినీకాంత్ మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. ‘జైభీమ్’ డైరెక్టర్
పి.జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ 170వ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు
చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు
సమాచారం. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రజినీ పోలీస్ పాత్రలో
కనిపిస్తారని టాక్. శర్వానంద్ కీలక పాత్రలో కనిపిస్తారట. ఈ దర్శకుడు రీసెంట్ గా తెరకెక్కించిన ‘జైభీమ్’ మూవీ రిలీజ్ అయ్యి ఎంత పెద్ద విజయం సాధించో అందరికి తెలుసు. ఇక ఇప్పుడు తన తదుపరి సినిమా రజినీకాంత్ తో అనౌన్స్ చేయడంతో ఈ మూవీ పై.. అనౌన్స్‌మెంట్‌ తోనే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. రజినీకాంత్ తన లేటెస్ట్ సినిమా జైలర్ అందించిన సక్సెస్ ను ఆస్వాదించే పనిలో పడ్డాడు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పకడ్బందీ స్క్రీన్ ప్లే కు ప్రేక్షకులు అంతా ఫిదా అయ్యారు.