సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన “జైలర్” కు పూర్తి స్థాయిలో తమిళనాడులో హిట్ టాక్ లభించింది. తెలుగు మరియు ఇతర రాష్ట్రాల్లో అబౌవ్ ఏవరేజ్ టు హిట్ టాక్ వచ్చింది. అయితే… రజనీకాంత్ అద్భుతంగా యాక్ట్ చేశారని పేరు రావడంతో అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లోనే రూ.300 కోట్ల కలెక్షన్లను దాటేసింది. రోబో 2.0 (రూ.405 కోట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో తమిళ చిత్రంగా నిలిచింది. అలాగే తమిళనాడులోనూ రూ.100 కోట్ల కలెక్షన్లను దాటేసింది. అక్కడ తొలి రోజు రూ.29 కోట్లు, రెండో రోజు రూ.20 కోట్లు, మూడోరోజు రూ.26 కోట్లు రాగా, నిన్న ఆదివారం ఏకంగా రూ.31 కోట్లు వసూలయ్యాయి.
“జైలర్” రికార్డులు సృష్టిస్తుంది.. 4 రోజుల్లో రూ.300 కోట్లు
Related News
Also Read