ప్రధానాంశాలు
Japan Movie Review: యంగ్ హీరో కార్తీ పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. కార్తీ ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో జపాన్ సినిమా (Japan Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై SS ప్రకాష్‌బాబు, SR ప్రభు కార్తీతో కలిసి చేస్తున్న ఏడవ చిత్రం ఇది. ఈ చిత్రం పాన్ ఇండియా థ్రిల్లర్‌గా విడుదలయింది.
నవంబర్ 10న జపాన్ సినిమా విడుదల
ఈ సినిమా నవంబర్ 10న దీపావళి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జపాన్ సినిమా తెరపైకి రావడంతో తమిళ సినీ అభిమానులు అద్భుతమైన ట్రీట్‌లో ఉన్నారు. నేడు జపాన్ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
ఇందులో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల ఫస్ట్ షో విడుదల కావడంతో.. జపాన్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా జపాన్ సినిమాకు ట్విట్టర్ లో మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుందని, మరికొంత మంది బాగోలేదని అంటున్నారు.
జపాన్ ట్విట్టర్ రివ్యూ | Japan Movie Review
సినిమా విడుదలైన వెంటనే, అభిమానులు మరియు ప్రేక్షకులు జపాన్ మూవీని చూడటానికి థియేటర్లకు తరలివచ్చారు. సినిమా చుసిన ప్రేక్షకులు వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ (Japan Movie Review) ద్వారా ప్రపంచంతో తమ అనుభూతిని పంచుకున్నారు. వారు జపాన్ అంటే ఏమిటి అని ట్వీట్లు కూడా పెట్టారు. రెగ్యులర్ షోలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి.
Also Read: గుంటూరు కారం సినిమాలో NTR… సోషల్ వైరల్ అవుతున్న వార్తలు