Home   »  వినోదం   »   రామ్ చరణ్ RC17 సినిమా నుండి తాజా అప్‌డేట్..!

రామ్ చరణ్ RC17 సినిమా నుండి తాజా అప్‌డేట్..!

schedule raju
Latest update from Ram Charan RC17 movie

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో RC17 రాబోతుందని ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్‌ అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా, హోలీ పండుగ సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఓ వార్తను పంచుకున్నారు.

RC17 అఫీషియల్ అనౌన్స్ మెంట్

భారతీయ సినిమాకు కొత్త రంగులు అద్దడానికి RC17 రెడీ అవుతోంది. భూమిని బద్దలు కొట్టే గొప్ప పని కోసం బలమైన శక్తులు (రాంచరణ్‌, సుకుమార్‌, DSP క్రేజీ కాంబో) తిరిగి కలుస్తున్నారు అంటూ రాంచరణ్‌, సుకుమార్‌ హోలీ సెలబ్రేషన్స్‌లో ఉన్న స్టిల్‌ను మైత్రీ మూవీ మేకర్స్ షేర్ చేశారు.

కేవలం హీరో దర్శకుడు మాత్రమే కాదు, రంగస్థలంకి పని చేసిన నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు. నేడు హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకుడిగా, రామ్ చరణ్ హీరోగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా చేస్తున్నారు.

గేమ్‌ ఛేంజర్‌ మొదటి పాట విడుదల

రాంచరణ్‌ ప్రస్తుతం RC 15గా తెరకెక్కుతున్న గేమ్‌ ఛేంజర్‌లో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ ఛేంజర్‌లోని మొదటి పాట విడుదలయ్యే అవకాశం ఉందని దాదాపుగా ఖరారైంది.

మే నెలతో ఈ మూవీ షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం. ఆ వెంటనే RC16 షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇక పుష్ప-2తో బిజీగా ఉన్న సుకుమార్ సెప్టెంబర్ తో ఫ్రీ అవుతారు. ఆ తరువాతే RC17ని స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది.

Also Read: Game Changer OTT Rights | భారీ ధరకు అమ్ముడైన గేమ్ ఛేంజర్ OTT హక్కులు..!