Home   »  వినోదం   »   సలార్ OTT విడుదలపై తాజా అప్‌డేట్.!

సలార్ OTT విడుదలపై తాజా అప్‌డేట్.!

schedule raju

Salaar OTT Release | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్ : సీజ్ ఫైర్ -పార్ట్ 1 OTT విడుదలపై నెట్‌ఫ్లిక్స్ ఓ తాజా అప్‌డేట్ ను అందించింది.

Latest update on Salaar OTT Release

Salaar OTT Release | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్ : సీజ్ ఫైర్ -పార్ట్ 1, డిసెంబర్ 22, 2023న ప్రపంచవ్యాప్త విడుదలయ్యింది. అయితే, ప్రస్తుతం ప్రేక్షకులు ఈ సినిమా OTT విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా, నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్ లో సలార్ స్ట్రీమింగ్ గురించి అప్‌డేట్ ను అందించింది. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషలలో తమ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ వివరాలను వెల్లడించింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన, సలార్: సీజ్ ఫైర్-పార్ట్ 1 లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, టిన్ను ఆనంద్, ఈశ్వరీ రావు మరియు శ్రీయా రెడ్డి వంటి భారీ తారాగణం ఉంది.

Also Read: Salaar Action Trailer: సలార్ యాక్షన్ ట్రైలర్ విడుదల వివరాలు