Home   »  వినోదం   »   Leo 2nd Single: లియో టీమ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్… సెకండ్ సింగిల్ విల్.!

Leo 2nd Single: లియో టీమ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్… సెకండ్ సింగిల్ విల్.!

schedule raju

Leo 2nd Single: దళపతి విజయ్ నటించిన లియో మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. బాడాస్ అంటూ సాగే ఈ పాటను ఈరోజు (సెప్టెంబర్ 28)న విడుదల చేసారు.

Leo 2nd Single: దళపతి విజయ్ (Vijay) అభిమానులు లియో ఆడియో లాంచ్ ఈవెంట్ లేదని మేకర్స్ స్పష్టం చేయడంతో తీవ్ర అసంతృప్తి చెందారు. ఈ సినిమా నుంచి బ్యాక్ టూ బ్యాక్ పోస్టర్లు రిలీజ్ తో సర్‌ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అభిమానుల కోసం చిత్ర బృందం మరో సర్‌ప్రైజ్ తో సిద్ధంగా ఉన్నారు.

Leo 2nd Single ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది

లియో సినిమా నుంచి సెకండ్ సింగిల్ ని నేడు (సెప్టెంబర్ 28)న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ ఆయన “నా రెడీ” పాట అభిమానులను ఒక ఊపు ఊపిన విషయం తెలిసిందే. అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ ఏ రేంజ్ లో ఉండబోతోందో అని అందరు ఎదురు చూస్తున్నారు. సెకండ్ సింగిల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా మేకర్స్ లియో మూవీ యొక్క కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అందులో దళపతి విజయ్ ఓ పెద్ద కత్తి పట్టుకొని అదిరిపోయే లుక్ లో కనిపించాడు.

లియో మూవీ రిలీజ్

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న లియో సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ పాత్రలో నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ లియో మూవీ అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి సిద్ధగా ఉంది.

లియో మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్‌ రద్దు

లియో మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను సెప్టెంబ‌ర్ 30న చెన్నైలో గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు నిర్మాణ సంస్థ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌ కోసం నెహ్రూ ఇండోర్ స్టేడియాన్ని వేదిక‌గా ఫిక్స్ చేసారు.

కానీ అనుకోని విధంగా ఈ ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్న‌ట్లు మేకర్స్ ట్విట్ట‌ర్ వేదికగా తెలియజేసారు. ఓవర్‌ఫ్లోయింగ్ పాస్‌ల అభ్యర్థనలు తాము ఊహించిన‌దానికంటే ఎక్కువ‌గా రిక్వెస్ట్‌లు వ‌చ్చాయ‌ని, వాటి భద్రతా పరిమితులను పరిగణనలోకి తీసుకుని, మేము లియో ఆడియో లాంచ్‌ (Leo Audio Launch Canceled)ను నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాము. లియో ఆడియో లాంచ్ పోస్టుపోన్ చాలా మంది ఊహించినట్లు రాజకీయ ఒత్తిళ్ల వల్ల కాదని. ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని” నిర్మాణ సంస్థ త‌మ ట్వీట్‌లో తెలియజేసింది.

Also Read: లియో ఆడియో లాంచ్ క్యాన్సిల్… అసలేమైందంటే.?