Home   »  వినోదం   »   Leo Movie Review: లియో మూవీ ఫస్టాఫ్ అదుర్స్.. కానీ సెకండాఫ్.!

Leo Movie Review: లియో మూవీ ఫస్టాఫ్ అదుర్స్.. కానీ సెకండాఫ్.!

schedule raju

Leo Movie Review: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో లియో చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విజయ్‌కి తమిళనాడులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదలయ్యిందంటే తమిళనాడులోని థియేటర్లలో హడావుడి ఉంటుంది. విజయ్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా చాలు బాక్సాఫీసు వద్ద ఆ సినిమా వందల కోట్లు వసూలు చేసేస్తుంది.

లియో మూవీ 35 దేశాల్లో విడుదల

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, సౌత్ ఇండియన్ స్టార్ అర్జున్, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ మరియు వాసుదేవ్ మీనన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో అక్టోబర్ 19 (ఈరోజు)వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది.

లియో సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద భారీ బజ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దాదాపు 35 దేశాల్లో విడుదల చేసారు. యూరప్, నార్త్ అమెరికా, దుబాయ్, ఇండియాలో అత్యధికంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను దాదాపు 12,000 స్క్రీన్లలో రిలీజ్ అయింది.

సోషల్ మీడియాలో అదిరిపోయే రివ్యూలు (Leo Movie Review)

ఇప్పటికే లియో సినిమా ప్రీమియర్స్ మొదలవ్వడంతో అభిమానులు పెద్ద ఎత్తున సినిమా చూస్తున్నారు. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ఈ సినిమా ఎలా ఉందో అని ట్విట్టర్ (X) లో రివ్యూ (Leo Movie Review)లు ఇస్తున్నారు.

లియో సినిమా అదిరిపోయిందని, సినిమా చూసిన అభిమానులు అనిరుధ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉందని అంటున్నారు. అలాగే విజయ్ యాక్షన్, లోకేష్ డైరెక్షన్ బాగుందని అంటున్నారు. అయితే లోకేష్ పాత సినిమాలకు లియో సినిమాకు లింక్ ఉందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

ఫస్టాఫ్‌కు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్

ప్రస్తుతానికి ఫస్టాఫ్‌కు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. లోకేష్ కనగరాజ్ టేకింగ్ నెక్ట్స్ లెవెల్ అని అభిమానులు మెచ్చుకుంటున్నారు. అలాగే, అనిరుధ్ రవిచందర్ సంగీతం కూడా ఎప్పటిలాగే అదిరిపోయిందని తెలుపుతున్నారు. ఇక క్లైమాక్స్ వేరే లెవల్ అంటున్నారు.

అయితే, సెకండాఫ్ విషయంలో చాలా మంది నిరుత్సాహ పడుతున్నారు. సెకండాఫ్ లో మాత్రం లోకేష్ కనగరాజ్ బాగా తియ్యలేకపోయాడని చాలా మంది అంటున్నారు. అర్జున్, సంజయ్ దత్ క్యారెక్టర్లు ఎంటర్ అయిన తరవాత సినిమా మారిపోయిందని అంటున్నారు. మరోవైపు, సినిమాకు సంబంధించి కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంటర్వెల్ లో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ఆ సీన్ అదిరిపోయిందని చాలా మంది అంటున్నారు. అలాగే, హైనాతో మంచులో విజయ్ ఫైట్ సీన్ కూడా వైరల్ అయింది. అక్కడ హైనా కుక్కలా కనిపిస్తోందంటూ కొందరు అంటున్నారు.

Also Read: జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. చరిత్ర సృష్టించిన ‘పుష్పరాజ్