Home   »  వినోదం   »   థియేటర్లలో కి “మా ఊరి పొలిమేర 2”

థియేటర్లలో కి “మా ఊరి పొలిమేర 2”

schedule raju

సత్యం రాజేశ్‌, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘మా ఊరి పొలిమేర 2’ మూవీ థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈసినిమా నవంబర్‌ 2న థియేటర్లలో కి రానున్నట్లు ఓ ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసింది. అంతకుముందు ఇదే కాంబినేషన్‌లో ‘మా ఊరి పొలిమేర’ మూవీ ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

కమెడియన్ సత్యం రాజేష్ క్షుద్ర మాంత్రికుడి గా నగ్నంగా కనిపించడం తో అందరూ షాక్ అయ్యారు. అలాగే ఈ చిత్ర టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవివర్మ లాంటి వాళ్ళు నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఉత్కంఠ పెంచేలా ఉంది. చివర్లో ‘ప్రాణం తీసుడు తప్పు కాదా మామా ‘ అని అంటే.. ‘ప్రాణం తీసుడు తప్పుకాని బలిస్తే తప్పేంది’ అనే డైలాగ్ చిత్రం పై మరింత ఆసక్తి కలిగించింది.

ఈ చిత్రాన్ని అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్నారు.. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ను మేకర్స్ అందించారు. కవిత ఎట్లా బ్రతికి వచ్చిందో తెలియాలంటే నవంబర్ 2 న గమ్మున అచ్చేయండి. ఈ సారి థియేటర్లలో లో సూద్దాం అంటూ సినిమా విడుదల పై ఆసక్తికర పోస్ట్ చేసారు.