ప్రధానాంశాలు
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) తన రాబోయే చిత్రం కన్నప్ప షూటింగ్లో సమయంలో గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీని వల్ల షూటింగ్ ను నిలిపివేశారు. విష్ణు కి గాయాల నుండి పూర్తిగా కోలుకున్నాకే తిరిగి రీషెడ్యూల్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
కన్నప్ప సినిమా షూటింగ్లో గాయపడ్డ మంచు విష్ణు(Manchu Vishnu)
ప్రస్తుతం న్యూజిలాండ్‌లో మేజర్ షెడ్యూల్ షూటింగ్లో ఉన్న విష్ణు ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా చేతికి డ్రోన్ తగలడంతో దెబ్బతగిలింది.
వెంటనే చిత్ర యూనిట్ అప్రమత్తమై విష్ణు ని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని చిత్ర వర్గాలు తెలిపాయి.
కీలక పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్, నయనతార
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కన్నడ శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ ఈ చిత్రంలో అతిధి పాత్రల్లో నటించనున్నారు. భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడి కథ ఆధారంగా పౌరాణిక చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రానికి 24 ఫ్రేమ్స్ మరియు AVA ఎంటర్టైన్మెంట్ల సహకారం అందిస్తున్నారు.
100 కోట్ల బడ్జెట్‌తో చిత్ర నిర్మాణం
మణిశర్మ సంగీతం అందించనున్న ఈ సినిమాను అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీ లోనూ విడుదల చేయనున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్‌తో మోహన్‌బాబు నిర్మిస్తున్నాడు. విజువల్స్, టెక్నికల్ అంశాల్లో హై స్టాండర్డ్స్‌లో ఈ సినిమా రూపొందుతోంది.
టెలివిజన్ షో మహాభారతానికి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా మొదలైనప్పుడు పెద్దగా అంచనాలు లేవు కానీ రెబల్ స్టార్ ప్రభాస్, నయనతార, మోహన్ లాల్ కీలక పాత్రలు పోషిస్తుండడంతో సినిమాపై అనూహ్యమైన అంచనాలు ఉన్నాయి.