Home   »  వినోదం   »   OTTలోకి రానున్న విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ..!

OTTలోకి రానున్న విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ..!

schedule mahesh

Merry Christmas | కోలీవుడ్ స్టార్ హీరో హీరో విజయ్ సేతుపతి , బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం “మెర్రీ క్రిస్మస్”. బద్లాపూర్, అంధాధున్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

merry-christmas|-vijay-sethupathi's-super-hit-mo

Merry Christmas | కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ న‌టి కత్రినా కైఫ్ క‌థ‌నాయిక‌గా న‌టించిన చిత్రం ‘మేరీ క్రిస్మస్’ . బద్లాపూర్, అంధాధున్ సినిమాలను దర్శకత్వం వహించిన శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాగా మంచి విజ‌యాన్ని అందుకొంది. అయితే తాజాగా ఈ చిత్రం OTT లోకి రానున్నట్లు తెలుస్తోంది.

OTTలోకి రానున్న Merry Christmas

ఈ చిత్రం ఫిబ్రవరి 9 లేదా 16 నుండి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. కాగా దినిపై నెట్‌ఫ్లిక్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా విడుదల చేయనున్నట్టు సమాచారం. దాదాపు రూ.60 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

మ్యాచ్ బ్యాంక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు టిప్స్ ఇండస్ట్రీస్‌తో కలిసి రమేష్ తౌరానీ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాధికా శరత్ కుమార్, సంజయ్ కపూర్, దిను ఆనంద, వినయ్ పాఠక్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read | OTTలోకి వచ్చేసిన మోహన్‌లాల్‌ సూపర్‌ హిట్‌ మూవీ..!