Home   »  వినోదం   »   యాక్షన్ సన్నివేశాల షూటింగ్ కోసం గోవా వెళ్ళిన తారక్..!

యాక్షన్ సన్నివేశాల షూటింగ్ కోసం గోవా వెళ్ళిన తారక్..!

schedule raju

Devara | ‘RRR’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ టైగర్ NTR ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కీలక సన్నివేశాలు పూర్తయ్యాయని సమాచారం.

NTR went to Goa for the action scenes of Devara

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ NTR హీరోగా నటిస్తున్న భారీ అంచనాలు గల చిత్రం ” దేవర ” విడుదల కోసం తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించడం మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

గోవాలో Devara కొత్త షెడ్యూల్

ఇటీవల, చిత్రబృందం షూటింగ్‌కి విరామం ఇచ్చిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తారక్ సోమవారం విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యాడు. అయితే మూవీ టీమ్ గోవాలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసిందని సమాచారం. దీనితో తదుపరి షూటింగ్ కోసం NTR గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్‌లో భాగంగా గోవాలో యాక్షన్ సీక్వెల్స్‌తో పాటు ఓ పాటను చిత్రీకరించాలని ‘దేవర‘ టీమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం NTRతో పాటు ఫిట్‌నెస్ ట్రైనర్ కుమార్ మన్నవ కూడా గోవా వెళ్లారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్, అందాల భామ జాన్వీ కపూర్, ఇతర నటీనటులు కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. దేవర చిత్ర యూనిట్ ఇప్పటికే అక్కడ జరిగే షూటింగ్‌కి సర్వం సిద్ధం చేసిందని, నేటి (మార్చి 19) నుంచి షెడ్యూల్ ప్రారంభం కానుందని ఇన్‌సైడ్ టాక్.

అక్టోబర్ లో విడుదల కానున్న దేవర

దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ‘RRR’ తర్వాత NTR నటిస్తున్న చిత్రం ‘దేవర’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ తొలుత ప్రకటించినప్పటికీ పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా కొత్త తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. దేవర అక్టోబర్ 10, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read: Akhanda-2 Movie | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో సెట్స్‌పైకి అఖండ-2.?