Home   »  వినోదం   »   గోవా వెళ్ళిన యంగ్ టైగర్… కారణమేమిటంటే.!

గోవా వెళ్ళిన యంగ్ టైగర్… కారణమేమిటంటే.!

schedule raju

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా (Devara) షూటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉంటున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా తర్వాత కొంత విరామం తీసుకుని ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీ అయ్యాడు.

శరవేగంగా కొనసాగుతున్న దేవర షూటింగ్

ఇక ఎన్టీఆర్ (NTR) బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్లో చాలా బిజీగా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ హైదరాబాద్ లో షూటింగ్ వర్క్ పూర్తి చేసుకుని గోవా వెళ్ళిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న వెంటనే గోవా వెళ్లడంతో గోవాకు ఎందుకు వెళ్లాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

గోవాలో NTR తదుపరి షూటింగ్

హైదరాబాదులో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగానే ఎన్టీఆర్ (NTR) కూడా గోవాలో తమ తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరగనుండడంతో గోవా వెళ్తున్న సంగతి తెలిసిందే. గోవాలో ప్రత్యేకంగా సెట్ వేసి హీరో హీరోయిన్ల మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా గోవా వెళ్లిన సంగతి తెలిసిందే.

దేవర షూటింగ్ లో పాల్గొననున్న జాన్వీ కపూర్

ఈ షెడ్యూల్ చిత్రీకరణలో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు కొరటాల శివ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.

ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదలై ఈ సినిమా విడుదలైన తర్వాత తదుపరి సీక్వెల్ షూటింగ్‌ను వెంటనే ప్రారంభించనున్నారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో కూడా భాగమయ్యాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

Also Read: బాక్సాఫీస్ వద్ద లియో రికార్డ్స్… భారీగా తగ్గిన రెండో రోజు కలెక్షన్లు