Home   »  వినోదం   »   సెప్టెంబర్‌ 2న పవన్‌ “OG” నుంచి అప్డేట్

సెప్టెంబర్‌ 2న పవన్‌ “OG” నుంచి అప్డేట్

schedule raju

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ దర్శకత్వంలో, దానయ్య నిర్మాణంలో తెరకక్కుతోన్న ‘OG‘ సినిమా నుంచి సెప్టెంబర్‌ 2న అప్డేట్ రానుంది. పవన్‌ బర్త్‌ డే సందర్భంగా అస్టేట్‌ ఇవ్వనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీంతో సినిమా నుంచి గ్లింప్స్‌ వీడియో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలిపాయి. అభిమానులారా వేచిఉండండి అంటూ మేకర్స్‌ ట్వీట్‌ చేయగా.. పవన్‌ ఫ్యాన్స్‌ వెయిటింగ్‌’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, తమిళ నటుడు అర్జున్ దాస్, నటి శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ చేసిన ఫోటోలు లీక్ అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.