ప్రధానాంశాలు
Operation Valentine: వరుణ్ తేజ్ మరియు మానుషి చిల్లర్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుందని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. యదార్థ సంఘటనల స్ఫూర్తితో రానున్న ఈ చిత్రం తెలుగు-హిందీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇది యాడ్ ఫిలిం మేకర్ మరియు సినిమాటోగ్రాఫర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న తొలి చలన చిత్రం.
సినిమా విడుదల తేదీని ఇన్స్టాగ్రామ్ షేర్ చేసిన సోనీ పిక్చర్స్
సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో సినిమా విడుదల తేదీని షేర్ చేసింది. “బెదిరింపుల ద్వారా శాంతికి భరోసా. #ఆపరేషన్ వాలెంటైన్: స్కై హై రివీల్,” అని పోస్ట్ చేసారు.
ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్‌పై సందీప్ ముద్దా నిర్మించారు మరియు నందకుమార్ అబ్బినేని మరియు గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్లు సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
వరుణ్ కెరీర్ లో తొలి హిందీ చిత్రం ‘Operation Valentine’
ఈ సినిమాలో వరణ్ తేజ్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మానుషి చిల్లర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో ఆమె ‘రాడార్ ఆఫీసర్’ గా కనిపించబోతుంది. ఇందులో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా కనిపించనున్నారు.
వరుణ్ కెరీర్ లో ఈ చిత్రం తొలి హిందీ మూవీగా ఉండబోతుంది. మానుషి కెరీర్ లో రెండో హిందీ సినిమా ఇది. ఇప్పటికే అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్‘ సినిమాతో ఆమె హిందీలో హీరోయిన్ గా అరంగేట్రం చేసినిది. భారతీయ వాయుసేనలో జరిగిన కొన్న వాస్తవ సంఘటనల ఆధారంగా ‘ఆపరేషన్ వాలెంటైన్‘ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, స్టిల్స్, వీడియోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందువల్ల సినిమాపై అంచనాలను భారీగా పెరుగుతున్నాయి.
Also Read: అక్టోబర్ వారంలో OTT లో విడుదల కానున్న సినిమాలు… వివరాలను తనిఖీ చేయండి.!