Home   »  వినోదం   »   తాను అద్దెకు ఉంటున్న ఇంటినే కొన్న ప్ర‌భాస్..!

తాను అద్దెకు ఉంటున్న ఇంటినే కొన్న ప్ర‌భాస్..!

schedule raju
Prabhas bought a house in London

Prabhas bought a house | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రాజెక్ట్ K, రాజా సాబ్, సలార్ 2 వంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అయితే ప్ర‌భాస్‌కు సంబంధించి ఒక సాలిడ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ప్రభాస్ లండన్‌లో ఓ లగ్జరీ హౌస్ కొన్నట్లు సమాచారం. తాను అద్దెకు ఉంటున్న ఇంటినే ఆయన భారీ ధరకు కొనుగోలు చేసినట్లు (Prabhas bought a house) తెలుస్తుంది. అయితే, దీనిపై ప్ర‌భాస్ నుంచి ఎటువంటి ప్ర‌క‌ట‌న రాలేదు. గతంలో ఆ ఇంటికి ప్రభాస్ నెలకు కోటి రూపాయలు అద్దె చెల్లించేవారని సమాచారం. షూటింగ్స్, వెకేషన్‌ కోసం వెళ్లినప్పుడు ఆయన ఆ ఇంట్లో ఉండేవారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు రాజా సాబ్ సినిమా షూట్ కూడా చేయనున్నారు.

Also Read: Siddharth And Aditi Rao Hydari | రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్ద్.. ఎక్కడంటే?