Home   »  వినోదం   »   Prabhas fans air salute: ప్రభాస్ ఫ్యాన్స్ సినిమాటిక్ ఎయిర్ సెల్యూట్

Prabhas fans air salute: ప్రభాస్ ఫ్యాన్స్ సినిమాటిక్ ఎయిర్ సెల్యూట్

schedule raju

Prabhas fans air salute: ప్రపంచ వ్యాప్తంగా సలార్‌కు ఇటీవల విడుదలైన ట్రైలర్ ,పాటలతో ఒక్కసారిగా ఆదరణ పెరిగింది. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కెనడాలోని టొరంటోలోని పచ్చటి మైదానంలో భారీ పోస్టర్‌ను ఏర్పాటు చేసిన ప్రభాస్ అభిమానులు… ఆ సమయంలో ఆరు హెలికాప్టర్లతో గాలిలో ఎయిర్ సెల్యూట్ చేసారు.

Prabhas fans air salute for salaar movie

Prabhas fans air salute: ఇటీవల విడుదలైన ట్రైలర్ ,పాటలతో ప్రపంచ వ్యాప్తంగా సలార్‌కు ఒక్కసారిగా ఆదరణ పెరిగింది. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 22న సలార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. నిర్మాత విజయ్ కిరగందూర్ కూడా ప్రచార కకార్యక్రమాలను ముమ్మరం చేశారు. వరుస ఇంటర్వ్యూలతో సలార్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూనే.. డైనోసార్ ప్రభాస్ కూడా ఎంట్రీ ఇచ్చి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

హెలికాప్టర్లతో ఎయిర్ సెల్యూట్ | Prabhas fans air salute

ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులు కూడా డార్లింగ్ పై తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల, కెనడాలో ప్రభాస్ అభిమానులు వినూత్న రీతిలో భారీ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రభాస్‌కు హెలికాప్టర్లతో ఎయిర్ సెల్యూట్ చేశారు. కెనడాలోని టొరంటోలో పచ్చటి మైదానంలో భారీ పోస్టర్‌ను ఏర్పాటు చేసిన ప్రభాస్ అభిమానులు… ఆరు హెలికాప్టర్లతో గాలిలో ఎయిర్ సెల్యూట్ చేసారు.

ప్రభాస్ పై ఉన్న అభిమానంతో కష్టపడి ఆ వీడియోను అద్భుతంగా రూపొందించారు. దీనికి సంబంధించిన వీడియోను హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు.

Also Read: సలార్ సినిమా నుండి మొదటి పాట విడుదల