Home   »  వినోదం   »   పుష్ప2 రిలీజ్‌ డేట్‌ ఖరారు.. ఎప్పుడంటే.?

పుష్ప2 రిలీజ్‌ డేట్‌ ఖరారు.. ఎప్పుడంటే.?

schedule raju

పుష్ప2 సినిమా విడుదల తేది ఖరారైనట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. 2024 మార్చి 22న ఈమూవీ విడుదల కానుందట. వరుసగా 4 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉండటంతో ఈ తేదీని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్‌కు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

 సమ్మర్ కానుకగా విడుదల చేయడంతో ఎక్కువగా ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉందని టీమ్ భావిస్తోందట. ఇక్కడ మరో విషయం ఏమంటే.. పుష్ప3 కూడా రానుందని తెలుస్తోంది. పుష్ప2లో పుష్పరాజ్ రూలింగ్ చూపిస్తూ ఓ  భారీ ట్విస్ట్‌‌తో ముగిస్తారట. ఇక పుష్ప 3తో ఈ సిరీస్‌ను ముగిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథ ఇప్పటికే రెడీ అయ్యిందట. ఈ మూడో పార్ట్.. 2025లో షురూ కానుందని తెలుస్తోంది.