Home   »  వినోదం   »   ర‌జ‌నీకాంత్ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌.. హీరోకు ఖరీదైన గిఫ్ట్‌

ర‌జ‌నీకాంత్ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌.. హీరోకు ఖరీదైన గిఫ్ట్‌

schedule raju

జైల‌ర్‌` గ్రాండ్ విక్ట‌రీతో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పంట పండింది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ `జైలర్‌`.. గ‌త నెల‌లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టించింది. ఇప్పటికే ఐదు వందల కోట్లు దాటి, ఆరు వందల కోట్ల దిశగా ప‌రుగులు పెడుతోంది. దింతో ‘జైలర్‌’ సినిమాతో రికార్డులను తిరగరాసిన సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కు ప్రొడ్యూసర్‌ మరో ఖరీదైన గిప్ట్‌ ఇచ్చారు. ఇప్పటికే రూ.210 కోట్లు అందించగా… తాజాగా BMW కారును ఇచ్చారు. BMW I7(రూ.1.95 కోట్లు),BMW X 7 (రూ.1.24 కోట్లు) కార్లలో ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోమని నిర్మాత కళానిధి మారన్‌ కోరగా… తలైవా BMW X 7 కారును ఎంచుకున్నారు. రజినీ హిట్‌కొడితే ఇలా ఉంటుందని ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు.