Home   »  వినోదం   »   నా తండ్రి నన్ను చంపాలనుకున్నాడు: నటుడు రవి కిషన్

నా తండ్రి నన్ను చంపాలనుకున్నాడు: నటుడు రవి కిషన్

schedule ranjith
Ravi Kishan | My father wanted to kill me: Actor Ravi Kishan

Ravi kishan | రేసుగుర్రం సినిమాతో విల‌న్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు రవి కిషన్. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ఆయ‌న‌ సౌత్ తో పాటు నార్త్ లోను వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇక‌ రవి కిషన్ తాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. త‌న సినీ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో, తన లైఫ్ లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడో ఇంటర్వ్యూలో వివరించాడు. ఆయన మాట్లాడుతూ తాను 17 ఏళ్ల వయస్సులోనే ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చేసానని వివరించాడు.

అయితే ఈ ఇంటర్వ్యూలో రవి కిషన్ (Ravi kishan)తన కన్న తండ్రి గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మా నాన్నలో ఎమోష‌న్స్ అస‌లు ఉండేవి కాదు. ఆయన చిన్న‌త‌నంలోనే తనను దారుణంగా కొట్టి చిత్రహింసలు చేసేవారు. ఒకానొక టైంలో నన్ను చంపాలి అనుకున్నాడు కూడా. ఆ టైంలో అమ్మకు విషయం అర్థమై, కేవలం రూ.500 చేతికి ఇచ్చి నన్ను పారిపోమని సలహా ఇచ్చింది. ఆ డ‌బ్బుతోనే ట్రైన్ ఎక్కి ముంబైకి వచ్చేసా అని ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం రవి కిషన్ తన తండ్రి గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read | Akhanda-2 Movie | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో సెట్స్‌పైకి అఖండ-2.?