RGV In Kalki: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కల్కి 2898 ఏడీ‘ సినిమాలో దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తో పాటు, దర్శకుడు రామ్గోపాల్ వర్మ (RGV) నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ (Anudeep) గతంలోనే చెప్పారని ఫ్యాన్స్ ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. యాంకర్ సుమ ఓ ప్రోగ్రాంలో ‘ప్రాజెక్ట్ K‘ లో విలన్ ఎవరని అడగ్గా.. రామ్ గోపాల్ వర్మ (RGV in Kalki) అని అనుదీప్ (Anudeep) చెప్పడంతో అంతా నవ్వుకున్నారు.
ప్రభాస్ (prabhas), దీపికా పదుకొనే (Deepika Padukone) జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan) వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్, గ్లింప్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
‘కల్కి 2898 ఏడీ’లో ఆర్జీవీ పాత్ర
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) అతిథిపాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) కీలక పాత్ర పోషిస్తున్నట్లు చాలా కాలంగా టాక్ నడుస్తోంది.
అయితే ఈ విషయానికి సంబంధించిన మూవీ యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. కాగా.. ఇప్పటికే స్టార్ క్యాస్టింగ్ తో ముందుకెళ్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలోకి ఆర్జీవీ వచ్చాడన్న వార్త ఇండస్ట్రీని షేక్ చేసిందనే చెప్పాలి. ఒకవేళ ఆర్జీవీ ఈ మూవీలో నటిస్తే.. ఏ పాత్ర చేశాడు? విలన్ గానా? లేక ఇంకేదైనా కీ రోల్ చేశాడా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.